టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగంటే తనకెంతో ఇష్టమని మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ అన్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లో హిట్‌మ్యాన్‌ అంటేనే తనకిష్టమని పేర్కొన్నాడు. ఇక బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా ఇష్టమన్నాడు.

Continues below advertisement


ప్రపంచ క్రికెట్లో తనకు అత్యంత ఇష్టమైన బ్యాటర్‌, బౌలర్‌ ఎవరన్న ప్రశ్నకు భజ్జీ జవాబిచ్చాడు. 'నాకిష్టమైన బ్యాటర్‌ రోహిత్‌ శర్మ. టీ20, వన్డే, టెస్టు క్రికెట్‌.. ఫార్మాటేదైనా రోహిత్‌ బ్యాటింగ్‌ చేస్తుంటే నమ్మశక్యం కానట్టుగా ఉంటుంది. అతడు చక్కగా సమయం తీసుకుంటాడు. బ్యాటింగ్‌ చేయడం ఇంత సులువా అన్నట్టు ఆడతాడు' అని భజ్జీ అన్నాడు.


Also Read: Ravi shastri on Virat Kohli: విరాట్‌ 3 నెలలు విరామం తీసుకుంటే చాలు.. సెంచరీల వరదే!


Also Read: IND vs WI: అనిల్‌ సర్‌ పాఠాలతోనే ఎదిగానన్న రవి బిష్ణోయ్‌! విండీస్‌తో తలపడే టీ20, వన్డే జట్లివే


'అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్‌ శర్మ అత్యుత్తమ బ్యాటర్‌. విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ను గౌరవిస్తూనే ఈ మాట చెబుతున్నా. ఆటలో వారంతా సమానమే. కానీ హిట్‌మ్యాన్‌ ఆడుతుంటే అతడో వేరే లెవల్‌ అన్నట్టుగా ఉంటుంది' అని హర్భజన్‌ తెలిపాడు. ఇక జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన బౌలరని ప్రశంసించాడు. అతడో ప్రపంచ స్థాయి పేసరని పేర్కొన్నాడు. వారిద్దరే తనకు ఇష్టమైన ఆటగాళ్లని తెలిపాడు.




విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టును రోహిత్‌ సారథిగా ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా సిరీసుకు సాధన  చేస్తుండగా అతడి పిక్క కండరాలు పట్టేశాయి. దాంతో టీ20, వన్డే, టెస్టు సిరీసులకు వెళ్లలేదు. ప్రస్తుతం అతడు ఫిట్‌నెస్‌ సంతరించుకున్నాడు. బరువు తగ్గి నాజూగ్గా మారాడు. వెస్టిండీస్‌ సిరీసులో జట్టు పగ్గాలు అందుకోబోతున్నాడు.