రెడ్‌మీ కే50 సిరీస్ స్మార్ట్ ఫోన్లు చైనాలో త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వీటి ప్రకారం.. ఈ సిరీస్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ 2022లో లాంచ్ కానుందని తెలుస్తోంది. రెడ్‌మీ కే40 సిరీస్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి.
రెడ్‌మీ కే50 సిరీస్‌లో మూడు ఫోన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. అవే రెడ్‌మీ కే50, రెడ్‌మీ కే50 ప్రో, రెడ్‌మీ కే50 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు. వీటిలో రెడ్‌మీ కే50 ప్రో ప్లస్ అన్నిటికంటే టాప్ ఎండ్ వేరియంట్. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్(వీబో ఐడీ) దీనికి సంబంధించిన ఫీచర్లను పోస్ట్ చేశారు.
దీని ప్రకారం ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8-సిరీస్ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ ఉండనుంది. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. పెద్ద బ్యాటరీ కూడా ఇందులో అందుబాటులో ఉంది. 67W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది. రెడ్‌మీ కే50 సిరీస్ మోడల్స్‌లో జేబీఎల్ స్టీరియో స్పీకర్లు ఉండనున్నాయని తెలుస్తోంది.
గతంలో వచ్చిన లీకుల ప్రకారం.. రెడ్‌మీ కే50, రెడ్‌మీ కే50 ప్రో, రెడ్‌మీ కే50 ప్రో ప్లస్‌లు మూడిట్లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. రెడ్‌మీ కే50లో 48 మెగాపిక్సెల్ కెమెరా, రెడ్‌మీ కే50 ప్రోలో 50 మెగాపిక్సెల్ కెమెరా, రెడ్‌మీ కే50 ప్రో ప్లస్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. రెడ్‌మీ కే50 ప్రో ప్లస్ 120W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో షియోమీ 11టీ, షియోమీ 11టీ ప్రో స్మార్ట్ ఫోన్లు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. షియోమీ 11టీనే రెడ్‌మీ కే40ఎస్‌గా చైనాలో లాంచ్ కానుందని వార్తలు వచ్చాయి. అయితే రెడ్‌మీ జనరల్ మేనేజర్ లు వీబింగ్ మాత్రం రెడ్‌మీ కే40ఎస్ అనే స్మార్ట్ ఫోన్ అసలు లాంచ్ కావడం లేదని తెలిపారు.
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!
Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!
Also Read: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర ఎంత ఉండనుందంటే?
Also Read: రూ.16 వేలలో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇదే!