అప్గానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇప్పుడు అందరి ఆలోచన ఆ దేశ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ పరిస్థితి ఏంటి? వీరిద్దరూ వచ్చే నెలలో ప్రారంభమయ్యే IPL ఆడతారా? లేదా అన్నది ఇప్పుడు అందరి అనుమానం.


Also Read: T20 World Cup 2021 Schedule: అభిమానులారా... గుడ్‌న్యూస్... రేపే ICC T20 ప్రపంచకప్ షెడ్యూల్


అప్గానిస్థాన్లో ( Afghanistan ) అమెరికా సేన‌లు ప్ర‌వేశించిన త‌ర్వాత ఈ రెండు ద‌శాబ్దాల్లో ఆ దేశం తాలిబ‌న్ల నుంచి ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ క్రికెట్ ఎంతో పురోగ‌తి సాధించింది. ర‌షీద్ ఖాన్‌ లాంటి మంచి స్పినర్లు ఆ దేశం నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు. తాజాగా ఆ దేశం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడి క్రికెట్, క్రికెటర్ల భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది. 


Also Read: IND vs ENG: నిన్న బాల్ టాంపరింగ్... నేడు బుమ్రా-మార్క్‌వుడ్ మధ్య గొడవ... మధ్యలో వచ్చిన జోస్ బట్లర్


ప్రస్తుతం ఈ ఇద్దరు క్రికెటర్లు అఫ్గానిస్థాన్‌లో లేరు. ఇంగ్లాండ్‌లో హండ్రెడ్ లీగ్ టోర్నీలో ఆడుతున్నారు. ఈ నెల 21న హండ్రెడ్ లీగ్ టోర్నీ ముగుస్తోంది. ర‌షీద్ ఖాన్ ట్రెంట్ రాకెట్స్‌కు, న‌బీ లండ‌న్ స్పిరిట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి కుటుంబసభ్యులు మాత్రం అఫ్గానిస్థాన్‌లోనే ఉన్నారు. అయితే క్రికెటర్లు రషీద్, నబీ ఇంగ్లాండ్ నుంచి నేరుగా UAE వచ్చి IPL ఆడతారా లేదా అనే దానిపై ముందు స్పష్టత లేదు. వాళ్లు వ‌స్తార‌న్న న‌మ్మ‌కం ఉందని మాత్రం BCCI చెప్పింది.


Also Read: Rashid Khan on Taliban: అఫ్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన రషీద్ ఖాన్‌ కుటుంబం.. యువ క్రికెటర్‌కు కంటిమీద కునుకు లేదు



ర‌షీద్‌, న‌బీ అందుబాటులో ఉంటారు: స‌న్‌రైజ‌ర్స్‌



త‌మ జట్టు తరఫున ఆడాల్సిన ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ న‌బీ మాత్రం యూఏఈలో జ‌రిగే ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటార‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ సోమ‌వారం ప్ర‌క‌టించింది. ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో టీమ్ సీఈవో ష‌ణ్ముగం మాట్లాడారు. ప్ర‌స్తుతం అక్క‌డ ఏం జ‌రుగుతున్న‌దానిపై మేము మాట్లాడ‌లేదు. కానీ వాళ్లు మాత్రం టోర్నీకి అందుబాటులో ఉంటారు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.


Also Read: IND vs ENG, 2 Test Highlights: లార్డ్స్ టెస్టులో భారత్ ఘన విజయం... 1-0 ఆధిక్యంలో భారత్... ఇంగ్లాండ్ 120 ఆలౌట్


ఈ నెల 31న త‌మ టీమ్ యూఏఈకి బ‌య‌లుదేరుతోంద‌ని ష‌ణ్ముగం వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ర‌షీద్ ఖాన్‌, న‌బీ ఇద్ద‌రూ హండ్రెడ్ టోర్నీ కోసం యూకేలో పర్యటిస్తున్నారు. అయితే త‌న కుటుంబాన్ని అఫ్ఘ‌నిస్థాన్ నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డేయాల‌న్న‌దానిపై ర‌షీద్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ చెప్పాడు. కాబూల్ ఎయిర్‌స్పేస్ మూసేయ‌డంతో అక్క‌డి నుంచి వివిధ దేశాల‌కు విమాన రాక‌పోక‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.