అంతర్జాతీయ టైటిళ్ల కరవుకు పీవీ సింధు ముగింపు పలికింది. సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సూపర్‌ 300 టోర్నీలో ఫైనల్ లో ఘన విజయం సాధించింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను భారత షట్లర్ పీవీ సింధు కైవసం చేసుకుంది. ఫైనల్ లో స్వదేశానికి చెందిన మాళవిక బన్సోద్‌ను ఓడించింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన పీవీ సింధు 35 నిమిషాల పాటు జరిగిన ఫైనల్‌లో ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించింది. కోవిడ్-19 కారణంగా డిప్లీటెడ్ మైదానంలో మ్యాచ్ నిర్వహించారు. దీంతో టాప్ సీడ్ సింధు టైటిల్ పోరులో బన్సోద్‌ను 21-13 21-16 తేడాతో సునాయాసంగా ఓడించింది. 2017లో BWF వరల్డ్ టూర్ సూపర్ 300 ఈవెంట్‌ తర్వాత మాజీ ప్రపంచ ఛాంపియన్ సింధుకి ఇది రెండో సయ్యద్ మోదీ టైటిల్.






అంతకు ముందు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఏడో సీడ్‌ ఇషాన్‌ భట్నాగర్‌, తనీషా క్రాస్టో... టి.హేమ నాగేంద్రబాబు, శ్రీవేద్య గురజాడపై వరుస గేమ్‌ల విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. 29 నిమిషాల్లో ముగిసిన శిఖరాగ్ర పోరులో భట్నాగర్-క్రాస్టో 21-16, 21-12తో అన్‌సీడెడ్ భారత జోడీపై విజయం సాధించారు. అంతకుముందు ఆర్నాడ్ మెర్కిల్, లూకాస్ క్లార్‌బౌట్ మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌ను ఫైనలిస్టులలో ఒకరికి కోవిడ్ -19 పాజిటివ్ రావడంతో 'నో మ్యాచ్'గా ప్రకటించారు.


Also Read: ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?


సెమీస్ లో 


అయితే శనివారం జరిగిన సెమీస్‌లో రష్యాకు చెందిన ఎవ్‌గెనియా కొసెత్సకయా ఆట మధ్యలోనే తప్పుకోవడంతో సింధు విజయం ఖరారు అయింది. తొలి సెట్లో 21-11తో పీవీ సింధు ముందంజలో ఉండగా అయిదో సీడ్‌ ఎవ్‌గెనియా పోరు నుంచి తప్పుకుంది. తొలి గేమ్‌లో ఆరంభం నుంచే పీవీ సింధు దూకుడు ఆడింగిం. విరామ సమయానికి 11-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది.  మరో సెమీస్‌లో మాళవిక 19-21, 21-19, 21-7తో అనుపమపై విజయం సాధించింది. 


Also Read: అండర్-19 ప్రపంచ కప్ లో కొనసాగుతున్న భారత్ జైత్రయాత్ర... పసికూన ఉగాండాపై ఘనవిజయం... శిఖర్ ధావన్ రికార్డ్ బ్రేక్ చేసిన రాజ్ బావా