టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించేందుకు భారత మహిళల హాకీ జట్టు సిద్దమైంది. టోర్నీ ప్రారంభంలో కాస్త తడబడినా... తర్వాత పుంజుకొని... సెమీస్‌వరకు చేరింది. సెమీ ఫైనల్‌లో అర్జంటీనాతో ఢీ కొట్టేందుకు సిద్ధమైంది.
ఆస్ట్రేలియాతో క్వార్టర్స్‌లో విజయం సాధించిన హాకీ జట్టు... ఒక్కసారిగా అంచనాలు తలకిందులు చేసింది. ఆస్ట్రేలియాపై విజయం సాధించే వరకు మహిళా హాకీ టీంపై ఎవరూ పెద్దగా హోప్స్ పెట్టుకోలేదు. కానీ ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో గెలుపొందిన రాణిరాంపాల్ టీం... అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు సెమీస్‌లో కూడా అద్భుతం చేస్తుందని ఎదురు చూస్తోంది.
ఇప్పుడు అర్జంటీనాతో పోరుకు సిద్ధమైంది భారత్ హాకీ జట్టు. అర్జంటీనా అనుకున్నంత సులభమేమీ కాదు... ఆ టీం క్వార్టర్స్‌లో జర్మనీని 3-0 గోల్స్ తేడాతో కొట్టి వచ్చింది.
దీనిపై స్పెషల్ ఫోకస్ చేసింది భారత్ టీం. ఇప్పటి వరకు తాము ఆడిన ఆట తీరుపై ఆనందం వ్యక్తం చేశారు కెప్టెన్ రాణి రాంపాల్. ముఖ్యంగా ఆస్ట్రేలియాను కొట్టడం మరింతగా టీంకు బూస్ట్ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా తమ ఆట తీరు మెరుగవుతూ వచ్చిందని... కచ్చిందా ఈ స్టేజ్‌కు వస్తామన్న నమ్మకంతోనే ఒలింపిక్స్‌కు వచ్చామంటున్నారు ఇండియన్ హాకీ టీం కెప్టెన్.
ఈ ఏడాది జనవరిలో జరిగిన అర్జెంటీనాపై గెలిచామని... ఆ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు యూజ్ అవుతుందంటున్నార రాణిరాంపాల్. గతాన్ని చూసుకునేంత సమయంలో ఇప్పుడు లేదని... తమ దృష్టంతా అర్జెంటీనాతో జరిగే సెమీఫైనల్‌పైనే ఉందంటున్నారు. ఈ స్టేజ్‌లో విజయాన్ని దూరం చేసుకునే పరిస్థితుల్లో తాము లేమని... ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఏ స్థాయి ఆటనైనా ఆడతామంటున్నారామె.
రెండు టీంలు కూడా సమఉజ్జీలుగా బరిలో దిగనున్నాయి. ఈ మధ్య కాలంలో కొన్ని మ్యాచ్ ఆడినందున... ఒకరి లోపాలు, ఎత్తులు, వ్యూహాలు మరొకరికి తెలుసని... సెమీఫైనల్‌లో అది స్పష్టం కనిపిస్తుందన్నారు రాణి. ప్రతి టూర్ చాలా ప్రత్యేకమైందని... అందులో ఒలింపిక్స్ అంటే ఇంకా స్పెషల్ అంటున్నారు.
ఇండియన్ మహిళా హాకీ టీం కోచ్ జార్డ్ మారిజ్నే కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అర్జెంటీనా టీం చాలా స్ట్రాంగ్ పోటీదారని... అందుకే ఒలింపిక్స్ సెమీఫైనల్ మ్యాచ్ అనుకున్నంత ఈజీ కాదన్నారు. అర్జెంటీనా డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ అని... గోల్ స్కోరింగ్ అవకాశాలను వదులుకోకుండా ఆడాలని తెలిపారు.
ఇండియన్ ఉమెన హాకీ టీం క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాపై స్టన్నింగ్ విక్టరీ సాధించింది. పెనాల్టీ గోల్ వేసి విజయాన్ని ముద్దాడింది. సెమీఫైనల్‌కు చేరుకుంది.
ALSO READ: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత్ బృందానికి అరుదైన అవకాశం...