India medals in paralympics 2024 : పారాలింపిక్స్‌లో(paralympics 2024) 25 పతకాలే లక్ష్యంగా సాగుతున్న భారత పారా క్రీడాకారులు అదిరే ప్రదర్శనతో అదరగొట్టారు. ఇప్పటికే 15 పతకాలు సాధించి లక్ష్యం దిశగా సాగుతున్నారు. మొక్కవోని సంకల్పం.. అద్భుత ఆటతీరు..చివరి వరకూ పోరాటంతో పతక పండ పండిస్తున్నారు. ఇక టార్గెట్ 25ను చేరుకావాలంటే భారత్ సాధించాల్సింది కేవలం 10 పతకాలే. భారత అథ్లెట్ల సత్తా, ప్రదర్శన చూస్తుంటే అది తేలికే అనిపిస్తుంది.





 

అదరహో...

పారిస్ పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. పతక పంట పండిస్తూ  అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు.  గత రెండు రోజులుగా కాస్త నెమ్మదించిన భారత అథ్లెట్లు సోమవారం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆటగాళ్ల ప్రదర్శనతో భారత్ పతకాల సంఖ్య 15కు పెరిగింది. సోమవారం ఒక్కరోజే భారత్ భారీగా పతకాలు సాధించింది. స్టార్ షట్లర్లు ఏకంగా నాలుగు పతకాలు సాధించి ఔరా అనిపించారు. బ్యాడ్మింటన్ లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో భారత్ షట్లర్లు మెరిశారు. దీంతో భారత పతకాల సంఖ్య 15కు చేరింది. ఆర్చరీ మిక్స్‌డ్‌ టీమ్‌ కాంపౌండ్‌ ఈవెంట్‌ శీతల్‌దేవి, రాకేశ్‌ జోడీ కాంస్య పోరులో భారత్‌ పతకం ఖాయం చేసుకుంది. బ్యాడ్మింటన్‌లో 4, అథ్లెటిక్స్‌లో 3, ఆర్చరీలో ఒక పతకంతో భారత పతకాల సంఖ్య 15కు పెరిగింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ 14వ స్థానంలో ఉంది. బ్యాడ్మింటన్‌లో నితేశ్‌ కుమార్(Nitesh kumar) స్వర్ణంతో అద్భుతమే చేశాడు. నితేశ్ ఆట చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు. గతంలో తొమ్మిది సార్లు ఓడిపోయిన బ్రిటన్ కు చెందిన డేనియల్‌ బెతెల్‌ పై చిరస్మరణీయ విజయం సాధించాడు. బ్యాడ్మింటన్ ఎస్ ఎల్3 విభాగంలో నితేశ్‌ కుమార్‌ 80 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో 21-14, 18-21, 23-21 తేడాతో గెలిచి భారత్ కు మూడో స్వర్ణాన్ని అందించాడు.

 


 

మిగిలిన ఈవెంట్లలోనూ..

బ్యాడ్మింటన్ లో ఎస్ ఎల్ 4 విభాగంలో సుహాస్‌ యతిరాజ్‌(Suhas Yatiraj), ఎస్ యూ విభాగంలో తులసిమథి మురుగేశన్(Thulasimathi murugesan) సిల్వర్ మెడల్స్ తో... ఎస్ యూ 5 విభాగంలో మనీష రామదాస్ కాంస్యంతో గెలిచాడు. దీంతో ఒక్క బ్యాడ్మింటన్ విభాగంలోనే భారత్కు నాలుగు పతకాలు దక్కాయి. అథ్లెటిక్స్ లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌ ఎఫ్‌64 విభాగంలో పసిడిని దక్కించుకున్నాడు. డిస్కస్‌ త్రోలో ఎఫ్ 56 విభాగంలో  కతునియా యోగేశ్‌... హైజంప్‌ టీ 47 విభాగంలో లో నిషాద్‌ కుమార్‌ సిల్వర్‌ మెడల్స్‌ దక్కించుకున్నారు. ఆర్చరీలో యువ సంచలనం శీతల్‌ దేవి, వరల్డ్‌ నంబర్‌వన్‌ ఆర్చర్‌ రాకేశ్‌ కుమార్‌ జోడీ కాంస్య పతకం నెగ్గి చరిత్ర సృష్టించింది.

 

సుమత అంటిల్ భళా..

 అంచనాలను అందుకుంటూ పారా అథ్లెట్‌, జావెలిన్ త్రోయర్ సుమిత్‌ అంటిల్‌ స్వర్ణంతో సత్తా చాటాడు. తొలి త్రోలోనే 70.59 మీటర్ల రికార్డు త్రో తో మరోసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పారాలింపిక్స్‌ చరిత్ర ఎఫ్‌54 విభాగంలో ఇదే ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. ఫైనల్‌ బరిలో నిలిచిన మిగిలిన మిగిలిన త్రోయర్లలో ఒక్కరు కూడా 68 మీటర్ల మార్కును దాటలేదు. 67.03 మీటర్లు విసిరిన శ్రీలంక అథ్లెట్‌ దులన్‌ కొడిథువక్కురజతం, ఆస్ట్రేలియా త్రోయర్ బురియన్‌ ముచల్‌ 64.89 మీటర్లతో కాంస్యం గెలుచుకున్నారు. పారిస్ 2024 పారాలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ 15 పతకాలు గెలుచుకోగా అందులో మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్యాలు ఉన్నాయి.