3 former Indian cricketers whose sons played Under19 cricket for India: అండర్ 19(Under19) క్రికెట్ జట్టులో స్థానం దక్కిందంటే... ఇక తర్వాతి గమ్యస్థానం సీనియర్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే. ఇప్పుడు దిగ్గజ ఆటగాళ్లుగా చలామణి అవుతున్న విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, బాబర్ ఆజం, టిమ్ సౌథీ, రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బెన్ స్టోక్స్, జో రూట్ జూనియర్ క్రికెట్లో అదరగొట్టిన వారే. ఆస్ట్రేలియాలో జరిగిన మొట్టమొదటి U-19 ప్రపంచ కప్ జరిగినప్పటి నుంచి అండర్ 19 జట్టుకు ఆటగాళ్లు ఎంపిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే మల్టీ ఫార్మట్ సిరీస్ కు భారత అండర్ 19 జట్టును ప్రకటించారు. ఈజట్టులో రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కుమారుడు సమిత్ ద్రవిడ్( Samit Dravid) కు చోటు దక్కింది. అయితే ద్రవిడ్ కుమారుడికి ముందు కూడా ముగ్గురు సీనియర్ ఆటగాళ్ల కుమారులు అండర్ 19కు ఎంపికై భారత జట్టుకు కూడా ప్రాతనిథ్యం వహించారు. తండ్రి-కొడుకులు ఇద్దరు అండర్ 19 జట్టుకు ఆడారు. వారెవరో తెలుసుకుందామా...?
రోజర్ బిన్ని-స్టువర్ట్ బిన్ని
రోజర్ బిన్నీ ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు. 1980లలో భారత జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో రోజర్ బిన్నీ ఒకడు. భారత్కు తొలి ప్రపంచకప్ అందించిన జట్టులో రోజర్ బిన్నిది కీలక పాత్ర. 1983 వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రోజర్ బిన్ని నిలిచాడు. ఓవర్‌కు నాలుగు పరుగుల కంటే తక్కువ ఎకానమీ రేటుతో ఎనిమిది మ్యాచ్‌లలో 18 వికెట్లు పడగొట్టాడు.రోజర్ భారత జట్టుతో ప్రపంచ కప్ గెలిచిన పంతొమ్మిదేళ్ల తర్వాత అతని కుమారుడు స్టువర్ట్ బిన్నీ న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చిన 2002 U-19 ప్రపంచ కప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. స్టువర్ట్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 34 పరుగులు చేశాడు. బౌలింగ్ లో ఆరు వికెట్లు కూడా పడగొట్టాడు.
యెగరాజ్ సింగ్-యువరాజ్ సింగ్
గరాజ్ సింగ్ 1980లలో భారత జట్టు తరపున ఒక టెస్ట్ మ్యాచ్, ఆరు వన్డేలు ఆడాడు. యోగరాజ్(Yograj Singh) రిటైర్మెంట్ ప్రకటించిన 19 సంవత్సరాల తర్వాత యోగరాజ్ సింగ్ కుమారుడు యువరాజ్(Yuvraj ) సింగ్ భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2000 సంవత్సరంలో జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించి... ప్రపంచ క్రికెట్‌లో తన రాకను ఘనంగా ప్రకటించాడు. ఆ ప్రపంచకప్ లో యువరాజ్ ఏడు ఇన్నింగ్స్‌లలో 103.57 స్ట్రైక్ రేట్‌తో 203 పరుగులు చేశాడు. బంతితో 12 వికెట్లు పడగొట్టాడు.
కృష్ణమాచారి శ్రీకాంత్- శ్రీకాంత్ అనిరుధ
1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో కృష్ణమాచారి శ్రీకాంత్(Kris Srikkanth) సభ్యుడు. భారత్ తరపున శ్రీకాంత్ 43 టెస్టులు, 146 వన్డేలు ఆడాడు. 6,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. శ్రీకాంత్ కుమారుడు అనిరుధ(Anirudha) 2004-05లో ఇంగ్లండ్ తో జరిగిన అండర్ 19 సిరీస్ లో భారత తరపున బరిలోకి దిగాడు. ఆ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అనిరుధ నిలిచాడు. కానీ ఎప్పుడూ సీనియర్ భారత జట్టులో అనిరుధకు చోటు దక్కలేదు. IPL కెరీర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ,సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు.