Rahul Dravid's son Samit named in squad for Australia series:  భారత జట్టు(Team India)లో స్థానం సంపాదించే దిశగా రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) కుమారుడు సమిత్‌ ద్రవిడ్‌(Samit Dravid) బలంగా ఆడుగులు వేస్తున్నాడు. తండ్రి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకుంటూ సమిత్‌ భారత అండర్‌ 19 జట్టుకు ఎంపికయ్యాడు. తన తండ్రి అడుగులు జాడలు అనుసరిస్తూ టీమిండియా తలుపు తట్టేందుకు సిద్ధమయ్యాడు. 


ది వాల్‌ ఆఫ్‌ ఇండియాగా.. మిస్టర్‌ డిపెండబుల్‌గా.. హెడ్‌ కోచ్‌గా భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు ఇక భారత జట్టులో ప్రకంపనలు సృష్టిస్తాడేమో చూడాలి.

 


 

ఆస్ట్రేలియాతో పోరు

ఆస్ట్రేలియాతో జరగబోయే అండర్-19  మల్టీ ఫార్మట్‌ సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ జట్టును ప్రకటించింది. చెన్నై, పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఈ అండర్-19 సిరీస్‌లో మూడు 50 ఓవర్ల మ్యాచ్చ్‌లు, రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. వన్డే జట్టుకు మహ్మద్ అమన్ కెప్టెన్‌గా ఎంపికవ్వగా... టెస్ట్‌ జట్టుకు సోహమ్ పట్వర్ధన్ సారథ్యం వహించనున్నాడు. సెప్టెంబ‌ర్ 21, 23, 26 తేదీల్లో వన్డేలు జరగనుండగా... సెప్టెంబ‌ర్ 30 నుంచి అక్టోబ‌ర్ ఏడో తేదీ వ‌ర‌కు నాలుగు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌లు రెండు జరగనున్నాయి. వన్డే, టెస్టులకు ప్రకటించిన రెండు జట్లలోను సమిత్‌కు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లకు ప్రకటించిన జట్టులో రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు సమిత్‌ ద్రవిడ్‌కు కూడా చోటు దక్కింది. దేశీయ స్థాయిలో సమిత్ అద్భుత ప్రదర్శనతో సత్తా చాటాడు. దేశీయ స్థాయిలో అమిత్‌ స్థిరంగా పరుగులు సాధిస్తున్నాడు. కేఎస్సీఏ మ‌హారాజా టీ20 ట్రోఫీలో మైసూరు వారియ‌ర్స్ త‌ర‌పున బరిలోకి దిగిన సమిత్‌.. ఆకట్టుకున్నాడు. సమిత్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. బెహార్ ట్రోఫీలో సమిత్‌ ద్రవిడ్‌ సత్తా చాటాడు. ఇందులో సమిత్‌ 8 మ్యాచుల్లో 362 పరుగులు చేయడమే కాకుండా16 వికెట్లు కూడా తీశాడు. 

 





జట్టు ఇదే..

వన్డే జట్టు: రుద్ర పటేల్, సాహిల్ పరాఖ్, కార్తికేయ, మొహమ్మద్ అమన్ (కెప్టెన్), కిరణ్ చోర్మలే, అభిజ్ఞాన్ కుందు, హర్వాన్ష్ సింగ్ పంగాలియా, సమిత్ ద్రవిడ్, యుధాజిత్ గుహా, సమర్థ్ ఎన్, నిఖిల్ కుమార్, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్, రోహిత్ రాజావత్, మొహమ్మద్ ఈనాన్. 

 

టెస్ట్‌ జట్టు: వైభవ్ సూర్యవంశీ, నిత్య పాండ్యా, విహాన్ మల్హోత్రా, సోహమ్ పట్వర్ధన్ (కెప్టెన్), కార్తికేయ, సమిత్ ద్రవిడ్, అభిజ్ఞాన్ కుందు, హర్వాన్ష్ సింగ్ పంగాలియా, చేతన్ శర్మ, సమర్థ్, ఆదిత్య రావత్, నిఖిల్ కుమార్, అన్మోల్జీత్ సింగ్, ఆదిత్య సింగ్, మొహమ్మద్ ఈనాన్.