India at Olympics Day 13 schedule:విశ్వ క్రీడల్లో భారత్ మరో పతకం సాధిస్తుందా లేదా అన్నది ఈరోజు తేలనుంది. ఈ 13వ రోజు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు అత్యంత కీలకం కానుంది. కీలక పతాకాంశాల్లో నేడు భారత్ తలపడనుంది. జావెలిన్ త్రో ఫైనల్లో భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా బరిలోకి దిగుతున్నాడు.
జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌లో తన మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల దూరం నీరజ్ చోప్రా బల్లెన్ని విసిరాడు. మరే ఇతర జావెలిన్ త్రోయర్ కూడా నీరజ్‌ను అదిగమించలేకపోయాడు. దీంతో నీరజ్ ఈసారి పతకం తెస్తాడని భారత క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్‌తో భారత్ అమీతుతీ తేల్చుకోనుంది. సెమీస్‌లో ఓడిపోయినా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న భారత హాకీ జట్టు కూడా పతకంపై ఆశలు రేపుతోంది. సెమీ ఫైనల్‌లో జర్మనీ చేతిలో ఓడిపోయినా భారత పురుషుల హాకీ జట్టు ఆటతీరు ఆకట్టుకుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ సేన చివరి వరరకూ తీవ్రంగా పోరాడినా 2-3తో మ్యాచ్ ఓడిపోయింది. కానీ ఈ కాంస్య పతక పోరులో గెలవాలని భారత్ పట్టుదలగా ఉంది.
బరిలోకి రెజ్లర్లు
అమన్ సెహ్రావత్, అన్షు మాలిక్ కూడా నేడు తమ పోరును ఆరంభించనున్నారు. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లలో వీరు తమ పోరాటాన్ని ప్రారంభిస్తారు. మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే రౌండ్ 2 గోల్ఫ్ ఈవెంట్‌లో అదితి అశోక్, దీక్షా దాగర్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు.
గోల్ఫ్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే రౌండ్ 2
అదితి అశోక్ -దీక్షా దాగర్ —12:30pm
అథ్లెటిక్స్
మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపెచేజ్ రౌండ్ (హీట్ 1): జ్యోతి యర్రాజి-2:05Pm
పురుషుల జావెలిన్ త్రో ఫైనల్: నీరజ్ చోప్రా– రాత్రి 11:55
రెజ్లింగ్
పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రౌండ్ ఆఫ్ 16: అమన్ సెహ్రావత్ -మధ్యాహ్నం 2:30
పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత సాధిస్తే): అమన్ సెహ్రావత్ —4.20PM
పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ సెమీ ఫైనల్స్ (అర్హత సాధిస్తే): అమన్ సెహ్రావత్ — రాత్రి 9:45
మహిళల 57 కేజీల ఫ్రీస్టైల్ రౌండ్ 16: అన్షు మాలిక్ — మధ్యాహ్నం 2:30
మహిళల 57 కేజీల ఫ్రీస్టైల్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత సాధిస్తే): అన్షు మాలిక్ —4:20 pm మహిళల 57 కేజీల ఫ్రీస్టైల్ సెమీ-ఫైనల్ (అర్హత సాధిస్తే): అన్షు మాలిక్ — రాత్రి 10:25
హాకీ
పురుషుల కాంస్య పతక పోరు: భారత్ vs స్పెయిన్ - సాయంత్రం 5:30