Cricket at Olympics 2028:ప్రపంచంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ అయినప్పటికీ, ఒలింపిక్ వేదికపై కనిపించి దశాబ్దాలు దాటిపోయింది. చివరిసారిగా 1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగాయి. సరిగా 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2028 లాస్ ఏంజిల్స్‌ ఒలింపిక్ క్రీడల్లో మళ్లీ మెరవబోతోంది. 2023 అక్టోబర్‌లో ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Continues below advertisement

లాస్ ఏంజిల్స్‌ 2028 నిర్వాహకులు క్రికెట్ పోటీల కోసం దక్షిణ కాలిఫోర్నియాలోని పామోనాలో ఉన్న ఫెయిర్ గ్రౌండ్స్‌ను వేదికగా ఎంపిక చేశారు. ఈ చారిత్రక మైదానంలో బుధవారం నాడు స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ స్టేడియం సుమారు పదివేల కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో నిర్మించబోతున్నారు. అంతర్జాతీయ ప్రామాణాలతో కూడిన ఈ ప్రీమియర్ క్రికెట్‌ స్టేడియం పురుషుల, మహిళల పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నిర్మాణ పనుల ప్రారంభాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ ఒక మైలురాయిగా అభివర్ణించింది. 

ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా ఒక క్రీడ మ్యాచ్‌ సమయాలను భారతీయ ప్రామాణిక సమయానికి అనుగుణంగా రూపొందించడం విశేషం. భారత ఉపఖండంలోని వంద కోట్లకు పైగా ఉన్న క్రికెట్‌ అభిమానులను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లాస్ ఏంజిల్స్‌ స్థానిక కాలమానం ప్రకారం మ్యాచ్‌లు ఉదయం 9 గంటలకు, సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభమవుతాయి. ఇది భారత కాలమాన ప్రకారం వరుసగా రాత్రి 9.30 గంటలకు, ఉదయం 7 గంటలకు అవుతుంది. ఈ సమయాలు భారత టీవీ ప్రేక్షకులకు, డిజిటల్ వీక్షకులకు అత్యంత అనుకూలమైనవి. 

Continues below advertisement

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సాధారణంగా ఒలింపిక్స్‌ క్రీడల్లో కాంస్య పతక పోరు ముగిసిన తర్వాతే స్వర్ణ పతక పోరు జరుగుతుంది. కానీ క్రికెట్‌ విషయంలో ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి, స్వర్ణ పతక మ్యాచ్‌ను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య నిర్వహించాలని నిర్ణయించారు. ఇది భారత్‌ ప్రైమ్‌కు సరిగా సరిపోతుంది. భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందని నమ్మకంతోనే వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి నిర్వాహకులు ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. 

LA28 ఒలింపిక్స్‌లో క్రికెట్ అత్యంత వేగవంతమైన టీ 20 ఫార్మాట్‌లో  నిర్వహిస్తారు. పురుషుల, మహిళల విభాగాల్లో చెరో ఆరు జట్లు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటాయి క్రికెట్ ఒలింపిక్స్‌ో చేర్చడం ద్వారా కొత్త దేశాలకు ఈ క్రీడను విస్తరించవచ్చని ఐసీసీ భావిస్తోంది. ఇప్పటికే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో టీ20 ఫార్మాట్‌ విజయవంతమైంది. 

ఐసీసీ ఛైర్మన్ జైషా ఈ పరిణామాలపై సంతోషం వ్యక్తం చేశారు. వేదికల ప్రకటన అనేది ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనానికి పడిన తొలి అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఐఓసీతో కలిసి క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒలింపిక్ ఉద్యమంలో భాగం కావడం వల్ల క్రికెట్‌కు వివిధ దేశాల ప్రభుత్వాల నుంచి మరింత నిధులు , మద్ధతు లభిస్తుందని ఐసీసీ పేర్కొంది. 

అమెరికా క్రీడా అభిమానులు హోమ్ రన్‌లు, లాంగ్ బాల్స్‌ను ఇష్టపడతారని, క్రికెట్‌లో ఇవి పుష్కలంగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒలింపిక్స్‌ ద్వారా అమెరికన్లకు క్రికెట్ పట్ల ఆసక్తి పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. LA28లో క్రికెట్‌తోపాటు బేస్ బాల్/ సాఫ్ట్ బాల్, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్, లాక్రోస్‌, స్క్వాష్ వంటి క్రీడలు కూడా కొత్తగా చేరాయి. 

భారత్‌ , ఉపఖండం కోసం మీడియా హక్కుల విక్రయం విషయంలో నిర్వాహకులు మూడు రకాల ప్యాకేజీలు సిద్ధం చేశారు. మల్టీప్లాట్‌ఫామ్‌, టీవీ ఓన్లీ, డిజిటల్‌ ఓన్లీ. దీని ద్వారా భారీ ఆదాయం సమకూరుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.