Padma Awards 2025 Update: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ శ్రీ అవార్డుల్లో క్రీడాకారుల్లో పెద్ద పీట వేసింది. దిగ్గజ క్రీడాకారులు పీఆర్ శ్రీజేశ్, రవిచంద్రన్ అశ్విన్, ఏఎం విజయన్, హర్విందర్ సింగ్, సత్యపాల్ సింగ్ లకు ప్రతిష్టాత్మక పద్మ  అవార్డులను ప్రకటించింది. హకీలో శ్రీజేశ్ , క్రికెట్లో అశ్విన్, ఫుట్ బాల్ లో విజయన్, పారాలింపియన్ హరిందర్ సింగ్ తమదైన ముద్ర వేశారు. పద్మ అవార్డుల్లో మూడో అత్యున్నత పురస్కారమైన పద్మ భూషణ్ అవార్డు శ్రీజేశ్ కు లభించింది.  గతేడాది భారత్ వరుసగా రెండో ఒలింపిక్ కాంస్య పతకాన్ని పురుషుల హకీ జట్టు సాధించడంతో గోల్ కీపర్ గా శ్రీజేశ్ సత్తా చాటాడు. అడ్డుగోడలా నిలబడి, ప్రత్యర్థి ఆటగాళ్లకు సింహస్వప్నంలా నిలిచాడు. ఆ ఒలింపిక్స్ లో ముఖ్యంగా క్వార్టర్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్ పై షూటౌట్ లో కీలకపాత్ర పోషించాడు. తన పోరాట పటిమతో ఎన్నో మ్యాచ్ ల్లో భారత్  విజయం సాధించేలా చేశాడు. అంతకుముందు కెప్టెన్ గాను భారత్ కు చిరస్మరణీయ విజయాలతోపాటు టోర్నీలను అందించాడు.  ఇక ఒలింపిక్స్ టోర్నీ తర్వాత తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. ఆ తర్వాత భారత జూనియర్ పురుషల జట్టుకు ప్రధాన కోచ్ గా శ్రీజేశ్ నియమితులయ్యాడు. 

క్రికెట్ లెజెండ్ అశ్విన్..భారత్ తరపున మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించిన అశ్విన్.. గతేడాది ఆసీస్ పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి సడెన్ షాకిచ్చాడు. ముఖ్యంగా భారత్ తరపున తను కీలక బౌలర్ గా నిలిచాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఘనత వహించాడు. తన కెరీర్లో 106 టెస్టులాడిన అశ్విన్, 537 వికెట్లతో సత్తా చాటాడు.

ఇక భారత ఫుట్ బాల్లో లెజెండ్ గా పేరుపొందిన ఐఎం విజయన్ కు కూడా పద్మశ్రీని ప్రభుత్వం ప్రకటించింది. 2000-2004 మధ్య భారత కెప్టెన్ గా కూడా విజయన్ పని చేశాడు. కేరళకు చెందిన విజయన్ 72 మ్యాచ్ ల్లో 29 అంతర్జాతీయ గోల్స్ సాధించాడు. భారత్ తరపున అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. కేరళ నుంచి ఎంతోమంది ఆటగాళ్లు వచ్చినా, వారిలో తన ప్రత్యేకతను విజయన్ చాటుకున్నాడు. 

పారాలింపియన్ హర్విందర్..ఇక పారాలింపియన్ హర్విందర్ సింగ్ కు కూడా ప్రతిష్టాత్మక పద్మ శ్రీ అవార్డు లభించింది. పురుషుల ఇండివిడ్యువల్ రికర్వ్ ఫైనల్లో పొలాండ్ కు చెందిన లుకాస్ట్ సిజెక్ ను ఓడించి గతేడాది పారాలింపిక్స్ లో నాలుగవ పతకాన్ని అందించాడు.  భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పౌర గౌరవాలలో ఒకటైన పద్మ అవార్డులు మూడు విభాగాలలో ప్రదానం చేస్తారనే సంగతి తెలిసిందే. పద్మవిభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీలుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఈ అవార్డులు అందిస్తారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం వంటి విభిన్న రంగాలలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి గౌరవార్థంగా ఇస్తుంటారు. ఈ అవార్డును పొందడం వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు గౌరవంగా భావిస్తున్నారు. పద్మ అవార్డులు పొందిన ఆటగాళ్లు:

పీఆర్ శ్రీజేష్- పద్మభూషణ్, రవిచంద్రన్ అశ్విన్ – పద్మశ్రీ, ,IM విజయన్ – పద్మశ్రీ, సత్యపాల్ సింగ్ – పద్మశ్రీ, హర్విందర్ సింగ్- పద్మశ్రీ.

Also Read: Ind Vs Eng 2nd T20 Updates: సమష్టిగా రాణించిన బౌలర్లు, సత్తా చాటిన అక్షర్, వరుణ్.. బట్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్