Mumbai Indians Women vs UP Warriorz, Eliminator: మహిళల ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడుతున్న యూపీ వారియర్జ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంది.


ముంబై ఇండియన్స్ మహిళలు (ప్లేయింగ్ XI)
హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ స్కివర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), మెలీ కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్


యూపీ వారియర్స్ (ప్లేయింగ్ XI)
అలిస్సా హీలీ(కెప్టెన్, వికెట్ కీపర్), శ్వేతా సెహ్రావత్, సిమ్రాన్ షేక్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, పార్షవి చోప్రా, రాజేశ్వరి గయాక్వాడ్


‘అసలు ముంబైకి ఎదురుందా..?’, ‘ముంబైని ఓడించడం కష్టం..’, ‘8 మ్యాచ్ లు గెలుస్తారు. పక్కా..’, ‘వీళ్లదే డబ్ల్యూపీఎల్ ట్రోఫీ’.. ఇవన్నీ మూడురోజుల క్రితం వరకూ వినిపించిన మాటలు.  కానీ రెండు మ్యాచ్ లతో అంతా తలకిందులైంది. టేబుల్ టాపర్స్ కాస్త  బొక్క బోర్లా పడ్డారు. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడి  నేరుగా ఫైనల్ ఆడాల్సిన స్థితి నుంచి ఎలమినేటర్ (ప్లేఆఫ్స్) ఆడి (?) అందులో గెలిస్తేనే ఫైనల్ కు చేరుకునే   స్థితికి చేరుకున్నారు.  ముంబై వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది.  సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడటంతో ఆ జట్టు ఎలిమినేటర్  ఆడాల్సిన  స్థితికొచ్చింది. 


ఈ సీజన్ లో ఆడిన ఐదు మ్యాచ్ లలో ఓడిన జట్టుగా  ఆర్సీబీ  చెత్త రికార్డు నమోదుచేస్తే అదే  క్రమంలో ఆడిన ఐదు మ్యాచ్ లనూ గెలుచుకున్న జట్టు  ముంబై ఇండియన్స్.  అసలు ఈ  లీగ్ లో తమకు ఎదురేలేదన్నవిధంగా  హర్మన్‌ప్రీత్ సేన  జైత్రయాత్ర సాగింది. కానీ  మార్చి  18న  యూపీ వారియర్స్ తో మ్యాచ్ లో ముంబై ఓడింది. ఆ ఒక్క మ్యాచే కదా ఓడింది  అనుకున్నారేమో గానీ  నిన్న ఢిల్లీ కూడా   షాకిచ్చింది. వాస్తవానికి ఢిల్లీతో మ్యాచ్ కు ముందు రెండు జట్లూ ఆరు మ్యాచ్ లు ఆడాయి.  ఢిల్లీ నాలుగింట్లో విజయం సాధించగా ముంబై ఐదు విజయాలతో టేబుల్ టాపర్స్ గా ఉండేది.   నెట్ రన్ రేట్ కూడా ఢిల్లీ (+1.431 )  కంటే ముంబై  (+2.670) కే ఎక్కువుంది.  కానీ నిన్న  ఢిల్లీ ముంబైని చిత్తుగా ఓడించడంతో నెట్ రన్ రేట్ కూడా మారింది. ప్రస్తుతం ఢిల్లీ నెట్ రన్ రేట్ +1.978 గా ఉండగా ముంబైకి +1.725 ఉంది.  ఫలితంగా ముంబై రెండో స్థానానికి పరిమితమైంది. 


డబ్ల్యూపీఎల్ నిబంధనల ప్రకారం  పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. రెండు మూడు స్థానాల్లో ఉన్న  జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాలి.