Sad News For Olympic medallist Manu Bhaker | చండీగఢ్: ఒలింపిక్ మెడలిస్ట్ మను బాకర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  రోడ్డు ప్రమాదంలో భారత టాప్ షూటర్ మను బాకర్ తన కుటుంబసభ్యులను కోల్పోయారు. హరియానాలోని ఛక్రి దాద్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మను బాకర్ మేనమామ, తన అమ్మమ్మ చనిపోవడంతో షూటర్ ఇంట్లో విషాదం నెలకొంది. మను బాకర్ మేనమామ యుద్వీర్ సింగ్, అమ్మమ్మ సావిత్రి దేవి ప్రయాణిస్తున్న బైకు ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదానికి గురైంది. అతివేగంగా దూసుకొచ్చిన కారు, వీరు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో స్కూటీ మీద వెళ్తున్న యుద్వీర్ సింగ్, సావిత్రి దేవి తీవ్ర గాయాలపాలై రక్తస్రావంతో మృతిచెందారు. కాగా, మను భాకర్ రెండు రోజుల కిందట ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్నారని తెలిసిందే.


అసలేం జరిగిందంటే..
భారత స్టార్ షూటర్ మను భాకర్ మేనమా, అమ్మమ్మ హర్యానాలోని ఛక్రి దాద్రిలోని మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో స్కూటీ మీద వెళ్తున్నారు. ఈ క్రమంలో అతి వేగంగా దూసుకొచ్చిన బ్రెజ్జా కారు వారి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారని పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్ అయిన తరువాత కారు అక్కడే వదిలేసి, డ్రైవర్ పరారయ్యాడు. ఈ ప్రమాదంపై ASI సురేష్ కుమార్ పీటీఐతో మాట్లాడుతూ, కారు, స్కూటీ ఢీకొన్నాయని సమాచారం అందగానే అక్కడికి చేరుకుని పరిశీలించాం. స్కూటీ మీద వెళ్తున్న ఉన్న ఇద్దరూ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవర్ భయంతో పరారయ్యాడని తెలిపారు. 






భారత్ పేరు నిలబెట్టిన మను బాకర్


2024 వేసవిలో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను బాకర్ రెండు పతకాలు సాధించారు. ఒక ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె నిలిచారు. కేవలం 22 ఏళ్ల వయసులో మను బాకర్ అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి పతకాల ఖాతా తెరిచిన మను భాకర్ మరో రజతకం నెగ్గారు. మరో విభాగంలో ఫైనల్స్ లో తృటిలో పతం చేజారింది. లేకపోతే ఒకే ఒలింపిక్స్‌లో మూడు పతకాలు ఆమె ఖాతాలో చేరేవి. 2021లో టోక్యో ఒలింపిక్స్ లో శ్రమించినా చివరి నిమిషంలో పతకం చేజార్చుకున్నారని తెలిసిందే.


Also Read: ICC Champions Trophy: జట్టు ఎంపికలో రోహిత్, గంభీర్ మధ్య విబేధాలు.. ఇద్దరు ప్లేయర్ల విషయంలో భేదాభిప్రాయాలు