Cocaine in Guntur district | గుంటూరు: ఏపీలో తొలి కొకైన్ కేసు నమోదైంది. గుంటూరు జిల్లాలో కోకైన్ కలకలం రేపింది. గుంటూరు ఎక్సైజ్ శాఖ పోలీసులు 8.5 గ్రాముల కోకైన్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. గుంటూరు శ్యామలా నగర్ వద్ద ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. వారిని విచారించగా కొకైన్ విషయం బయటపడింది. ఈ ఏడాది జిల్లాలో తొలి కొకైన్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
గుంటూరులో కొకైన్ విక్రయాలుగుంటూరు సిటీలోలో ఒక్క గ్రామ్ కోకైన్ 3 వేల నుంచి రూ.6 వేల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. నల్లచెరువుకు చెందిన ముగ్గురు వ్యక్తులు నగరంలో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నారు. 7 ప్యాకేట్లల్లో ఉన్నటువంటి 8.5 గ్రాముల కోకైన్ ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. గంజాయి, కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలకు సంబంధించిన వివరాలు తెలిస్తే 14500 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు.
ఏపీ ప్రభుత్వం గంజాయి, కొకైన్, ఇతర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడైనా డ్రగ్స్ కనిపిస్తే, వాటి గురించి సమాచారం తెలిసినా తమకు చెప్పాలని అధికారులు ప్రజలకు సూచించారు. కూటమి ప్రభుత్వంలో పలుమార్లు టన్నుల కొద్ది గంజాయిని గుర్తించి ధ్వంసం చేశారు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో డ్రోన్ల సాయంతో గంజాయి సాగును గుర్తించిన అధికారులు అక్కడికి వెళ్లి వారికి అవగాహనా కల్పించారు. ఎవరికైనా సాయం కావాలంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తుందని.. అనవసరంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల జోలికి కేసులలో ఇరుక్కోకూడదని హెచ్చరించింది. డ్రగ్స్ ద్వారా ఒక్కరి జీవితమే కాదు, కుటుంబాలు మొత్తం నాశనం అవుతాయని వాటి నుంచి బయట పడేందుకు అధికారులను ఆశ్రయించవచ్చునని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలుమార్లు సూచించారు.
Also Read: Amit Shah AP Tour: పవన్ కళ్యాణ్‌కు కుర్చీ లేదని గమనించిన అమిత్ షా, వెంటనే ఏం చేశారో చూడండి