Sunrisers Hyderabad vs Punjab Kings: ఐపీఎల్ 14వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ పిచ్ ప్రారంభంలో బ్యాటింగ్‌కు ఎంతగానో అనుకూలిస్తుంది. మ్యాచ్ గడిచే కొద్దీ స్పిన్నర్లకు సపోర్ట్ దొరుకుతుంది. బ్యాట్ మీదకు బంతి రావడం కూడా కష్టం అవుతుంది. మరి సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకోకుండా బౌలింగ్ ఎందుకు ఎంచుకుందో అర్థం కావట్లేదు.
టాస్ పూర్తయ్యాక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ‘మేం టాస్ గెలిస్తే మొదట బ్యాటింగే ఎంచుకునే వాళ్లం. స్కోరు బోర్డుపై భారీ స్కోరు పెట్టడానికి ప్రయత్నిస్తాం’ అన్నాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మొదట బ్యాటింగ్ చేసిన వారికి ఈ పిచ్ స్వర్గధామం లాంటిది అని. సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ఇందులో కూడా ఓడితే హ్యాట్రిక్ పూర్తవుతుంది. మరి ఇంత కీలకమైన మ్యాచ్‌తో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, అసలు సన్‌రైజర్స్ వ్యూహం ఏంటి అనేది మ్యాచ్ మొదలైతే కానీ చెప్పలేం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, నాథన్ ఎల్లిస్, మోహిత్ రాథీ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్
⦿ మ్యాచ్ 1: ఏప్రిల్ 2వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ - హైదరాబాద్ (వేదిక) (72 పరుగులతో రాజస్తాన్ విజయం)
⦿ మ్యాచ్ 2: ఏప్రిల్ 7వ తేదీ - లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - లక్నో (ఐదు వికెట్లతో లక్నోవిజయం)
⦿ మ్యాచ్ 3: ఏప్రిల్ 9వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ - హైదరాబాద్
⦿ మ్యాచ్ 4: ఏప్రిల్ 14వ తేదీ - కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - కోల్‌కతా
⦿ మ్యాచ్ 5: ఏప్రిల్ 18వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ - హైదరాబాద్
⦿ మ్యాచ్ 6: ఏప్రిల్ 21వ తేదీ - చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - చెన్నై
⦿ మ్యాచ్ 7: ఏప్రిల్ 24వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - హైదరాబాద్
⦿ మ్యాచ్ 8: ఏప్రిల్ 29వ తేదీ - ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - ఢిల్లీ
⦿ మ్యాచ్ 9: మే 4వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - హైదరాబాద్
⦿ మ్యాచ్ 10: మే 7వ తేదీ - రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - జైపూర్
⦿ మ్యాచ్ 11: మే 13వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ - హైదరాబాద్
⦿ మ్యాచ్ 12: మే 15వ తేదీ - గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - అహ్మదాబాద్
⦿ మ్యాచ్ 13: మే 18వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - హైదరాబాద్
⦿ మ్యాచ్ 14: మే 21వ తేదీ - ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - ముంబై