ఐపీఎల్‌లో రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త ఘనత సాధించాడు. ఆదివారం సన్‌‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 1000 పరుగుల మార్కును రుతురాజ్ గైక్వాడ్ చేరుకున్నాడు. కేవలం 31 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డు అందుకున్న రుతురాజ్ గైక్వాడ్... సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. సచిన్ టెండూల్కర్ కూడా 31 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డు సాధించాడు.


ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో సురేష్ రైనా (34 ఇన్నింగ్స్), దేవ్‌దత్ పడిక్కల్ (35 ఇన్నింగ్స్), రిషబ్ పంత్ (35 ఇన్నింగ్స్), గౌతం గంభీర్ (36 ఇన్నింగ్స్) ఉన్నారు. ఈ సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఫాంలో లేక ఇబ్బంది పడుతున్నాడు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో అయితే సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో చేసిన 73 పరుగులే తన అత్యధిక స్కోరు.