RCB IPL victory 2026: క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు. అవి వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలు. దీనికి తాజా నిదర్శనం రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB). వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు, తన కొత్త యజమానులకు ఆరంభంలోనే అద్భుతమైన బహుమతి అందించింది. బిలియన్ డాలర్ల డీల్‌తో జట్టును మార్చి నెలలోనే చేజిక్కించుకున్న కొత్త కన్సార్టియంకు ఈ విజయం ఎలాంటి లాభాలు తెచ్చిపెట్టోబోతోంది? అసలు ఈ డీల్‌ వెనుక ఉన్న వ్యూహాలేంటి? అనే అంశాలను డీకోడ్ చేద్దాం. 

Continues below advertisement

దుమ్మురేపిన ఆర్సీబీ

మే 31 అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌ పోరులో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్‌ గెలిచిన జట్టు కేవలం చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సరసన బెంగళూరు చేరింది. ఈ విజయం జట్టు పట్ల అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ను రెట్టింపు చేసింది. 

Continues below advertisement

మూడు నెలల్లోనే జాక్‌పాట్

మార్చి చివరి వారంలో ఆర్సీబీ యాజమాన్యం చేతులు మారింది. లండన్ కేంద్రంగా పని చేసే లిక్కర్‌ కింగ్‌ డీయోజియో నుంచి ఈ జట్టును ఒక కన్సార్టియం కొనుగోలు చేసింది. దీనికి ఆదిత్య బిర్లా గ్రూప్ నాయకత్వం వహించగా, ఇందులో టైమ్స్ ఆఫ్‌ ఇండియా గ్రూప్, బోల్డ్ వెంచర్స్, బ్లాక్ స్టోన్ భాగస్వాములుగా ఉన్నాయి. 1.78 బిలియన్ డాల్లు అంటే 14800 కోట్ల రూపాయలతో డీల్‌ను క్లోజ్ చేశారు. ఈ ఒప్పందం జరిగిన తక్కువ కాలంలోనే జట్టు టైటిల్ గెలవడం, కొత్త యజమానులకు బ్రాండింగ్ పరంగా పెద్ద ఊరట ఇచ్చింది. 

ఎక్కువ మంది చదివిన ఈ వార్తలు మిస్ అవ్వొద్దు

1కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
2ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
3రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ
4ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే
5ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్

ప్రపంచవ్యాప్తంగా తనకు ఉన్న అప్పులను తగ్గించుకోవాలనే వ్యూహంతో డియోజియో ఆర్సీబీని అమ్మేసింది. జట్టు నంబర్‌ 1 స్థానంలో ఉన్నప్పుడే, మంచి ధర వస్తున్న సమయంలో విక్రయించం ద్వారా తమ బ్యాలెన్స్ షీట్‌ను ఆ సంస్థ అప్‌డేట్ చేసుకుంది. ఐపీఎల్‌నే అత్యంత ఉత్సాహవంతులైన జట్లలో ఒకటి కావడంతో  ఆర్సీబీకి మంచి ధర పలికింది. 

ఆర్సీబీ పేరు మారుతుందా? 

జట్టు పేరులోని రాయల్ ఛాలెంజ్ అనేది నిజానికి యునైటెడ్‌ స్పిరిట్స్‌కి చెందిన ఒక మద్యం బ్రాండ్. అయితే కొత్త యజమానులు అదే పేరు కొనసాగించే అవకాశం ఉంది. ఆర్సీబీ అనేది ఇప్పుడు ఒక బ్రాండ్‌పేరు మాత్రమే కాదు. అది ఒక జెనరిక్‌ పేరుగా మారిపోయింది. లోగోలో చిన్నపాటి మార్పులు చేసినా, రాయల్ ఛాలెంజర్స్‌ ఏ విషయాన్ని కూడా మార్చకపోవడమే  లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు. 

సవాల్‌గా మారిన విరాట్ 

ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ కోహ్లీ తప్పుకుంటే, జట్టు బ్రాండ్ వాల్యుపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. అయితే కొత్త యజమానులు ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకునే భారీ పెట్టుబడి పెట్టి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఐపీఎల్ మార్కెట్‌లో పెరిగిన పోటీ 

కేవలం ఆర్సీబీ మాత్రమే కాదు. ఇటీవల కాలంలో ఐపీఎల్ జట్ల విలువ విపరీతంగా పెరిగాయి. గుజరాత్‌ టైటాన్స్‌ వాటాను అహ్మదాబాద్‌కు చెందిన టోరెంట్‌ గ్రూప్‌ మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ తన ఫ్యామిలీ ఆఫీస్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ లోని 75 శాతం వాటాను కొనుగోలు చేశారు. 

ఆర్సీబీ సాధించిన ఈ విజయం కేవలం ఒక ట్రోఫీకే పరిమితం కాలేదు. ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియంకు మార్కెట్‌లో తిరుగులేని గుర్తింపును, ఆర్థికంగా బలమైన పునాదిని వేసింది.