Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి కప్ కొట్టడం వెనుక పెద్ద ప్లాన్ ఉంది. అది టాస్ వద్దే మొదలయింది. టాస్ గెలిచిన నిమిషం నుంచే పక్కాగా అమలు చేసిన మైండ్ గేమ్ అండ్ ప్లానింగ్ RCB కు మరోసారి కప్ ను తెచ్చి పెట్టాయి. అహ్మదాబాద్ పిచ్‌పై మొదట బౌలింగ్ తీసుకున్న కెప్టెన్ రజత్ పటిదార్ మ్యాచ్ స్టార్టింగ్ నుంచే గుజరాత్ టైటాన్స్‌పై అటాకింగ్ ప్లాన్ వేశాడు.
గుజరాత్ ను ఓడించాలి అంటే వాళ్ల టాప్ త్రీ బ్యాటర్లయిన గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్‌లను త్వరగా చేయాలి. అనుకున్నట్టుగానే భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ గుజరాత్ టాప్ ఆర్డర్‌ను పవర్‌ప్లేలోనే కుప్పకూల్చారు. ఆ తర్వాత రసిక్ సలామ్ మూడు వికెట్లతో మిడిల్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. గుజరాత్ బ్యాటర్లకు ఊపిరి పీల్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆర్‌సీబీ బౌలర్లు అటాక్ చేస్తూనే ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేసి 50 రన్స్ చేసినా.. ఆర్‌సీబీ పక్కా బౌలింగ్ ప్లాన్ ముందు గుజరాత్ కేవలం 155 పరుగులకే పరిమితమైంది.
ఇక బ్యాటింగ్‌లో కూడా ఆర్‌సీబీది అదే అటాకింగ్ స్ట్రాటజీ. స్కోర్ చిన్నదే అయినా డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లకుండా ఓపెనర్లు కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ మొదటి ఓవర్ నుంచే బౌండరీలు బాదారు. రబాడ, సిరాజ్ ఓవర్లలో విరుచుకుపడి పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను వన్‌సైడ్ చేశారు. మిడిల్ ఓవర్లలో కొన్ని వికెట్లు పడి మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారినప్పటికీ, చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉండి ప్లాన్‌ను పక్కాగా ఫినిష్ చేశాడు.