Rcb News: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గురించి అందరికీ తెలిసిందే. దురదృష్టాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్ కు చేరిన ఆ జట్టు ఒక్కసారి కూడా చాంపియన్ గా నిలవలేక పోయింది. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ఆడుతున్న ఆర్సీబీ.. 2009,2011, 2016 ఇలా మూడుసార్లు ఫైనల్ కు చేరినా ఓటమి తప్పలేదు. తొలిసారి డెక్కన్ ఛార్జర్స్, రెండోసారి చెన్నై సూపర్ కింగ్స్, మూడోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయం పాలైంది. ఆ తర్వాత మళ్లీ ఫైనల్ మొహం చూడలేదు. అయినా కూడా ఆ జట్టు ఫ్యాన్ బేస్ ఇసుమంతైనా తగ్గలేదు. ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. ఈ సాలా కప్ నమ్దే అంటూ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకుంటూ రావడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా వచ్చే సీజన్ లో ఆర్సీబీ నెగ్గాలని వినూత్న ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరలైంది. అభిమానులు లైకులు, కామెంట్లు, షేర్లతో స్పందిస్తున్నారు.
ఇంతకీ ఏముందంటే..
ప్రస్తుతం ప్రయాగరాజ్ లో కుంభమేళ జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశవిదేశాల్లోని హిందువులు త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఆర్సీబీ ఫ్యాన్.. తనతోపాటు ఆర్సీబీ జెర్సీని కూడా గంగానదిలో ముంచి తీశాడు. దీంతో జట్టుకున్న దోషాలన్నీ పోయి, ఈ ఏడాది ఆ జట్టు విజయం సాధిస్తుందని అతని నమ్మకంగా ఆర్సీబీ అభిమానులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ తన జట్టును పటిష్టం చేసుకుంది. ఇండియన్ స్టార్ విరాట్ కోహ్లీతోపాటు మరింతమందితో జట్టును దుర్బేధ్యం చేసింది. వేలంలో ఆ జట్టు రూ.12.5 కోట్లతో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్‌ని కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ను రూ.11.5 కోట్లకు, లియామ్ లివింగ్‌స్టోన్‌ను రూ.8.75 కోట్లకు దక్కించుకుంది
జితేశ్ శర్మకు భారీ ఖర్చు..
ఆశ్చర్యకరంగా వికెట్ కీపర్ జితేష్ శర్మ కోసం ఆర్సీబీ రూ.11 కోట్లు వెచ్చించింది. అలాగే రసిక్ దార్ (రూ.6 కోట్లు), సుయాష్ శర్మ (రూ.2.6 కోట్లు)లను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 వేలానికి ముందు విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యశ్ దయాల్‌లను ఆర్‌సీబీ అట్టిపెట్టుకుంది. రూ.83 కోట్ల భారీ పర్స్‌తో వేలంలోకి వచ్చిన ఆర్‌సీబీ.. 19 మంది ఆటగాళ్లను తీసుకుంది. లుంగి ఎంగిడి, నువాన్ తుషార, రొమారియో షెఫర్డ్ లాటి విదేశీ ఆటగాళ్లను ఆర్‌సీబీ దక్కించుకుంది. దేవ్‌దత్ పడిక్కల్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రాధే, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ లాంటి ఇండియన్ ప్లేయర్స్ జట్టులోకి వచ్చారు. పడిక్కల్, సుయాష్ శర్మలు దేశవాళీ టోర్నీలలో సత్తాచాటారు.
Also Read: Rohit Sharma: అదే కథ.. అదే వ్యథ.. రంజీల్లోనూ విఫలమైన రోహిత్.. కెరీర్ కు ముప్పు తప్పదా..?