Ranji Trophy News: భారత వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తన లక్కును మెరుగుపర్చుకుందామని డొమెస్టిక్ క్రికెట్ లో ఆడుతున్నా.. ఏది కలిసి రావడం లేదు. గురువారం సొంతగడ్డ ముంబైలో జమ్ము కశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 3 పరుగులకే ఔటయ్యాడు. ఫుల్ షాట్లు కొట్టడంలో దిట్ట అయిన రోహిత్.. అదే బంతికి పెవిలియన్ కు చేరాడు. ఉస్మాన్ నజీరి మీర్ సంధించిన బౌన్సర్ కి రోహిత్ వద్ద సమాధానం లేకుండా పోయింది. బంతిని చూసి సర్ప్రైజ్ అయిన రోహిత్.. మిడాఫ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కొండంత రాగం పాడి, ఏదో చేసినట్లు ఇన్నాళ్లు ప్రాక్టీస్ చేసి మళ్లీ రోహిత్ విఫలమవడపై భారత అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక రోహిత్ బ్యాటింగ్ ను చూద్దామని ఆశగా మైదానానికి వచ్చిన జనం, నిరాశగా వెనుదిరిగారు. 






జైస్వాల్ కూడా ఫ్లాప్..
భారత టెస్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఈ మ్యాచ్ లోనే ముంబై తరపున బరిలోకి దిగాడు. అయితే తను కూడా 5 పరుగులు చేసి విఫలమయ్యాడు. నిజానికి రంజీల్లో జమ్మూ కశ్మీర్ కాస్త బలహీనమైన జట్టు.. దానిపైనే స్టార్ బ్యాటర్లయిన రోహిత్, జైస్వాల్ విఫలమవడంపై విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు రోహిత్ కెరీర్ ఎండింగ్ కి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ లో రోహిత్ వైఫల్యాల పరంపర కొనసాగింది. ఈ సిరీస్ లో మూడు టెస్టుల్లో కలిపి 5 ఇన్నింగ్స్ లు ఆడిన హిట్ మ్యాన్ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ చివరగా ఆడిన  బాక్సింగ్ డే టెస్టులో ఏరి కోరి మరి తన ఓపెనింగ్ పొజిషిన్ లోకి వచ్చిన రోహిత్ కేవలం ఐదు బంతులకే ఔటయ్యాడు. జట్టులోతన బ్యాటింగ్ స్థానం గురించి యువ క్రికెటర్ శుభమాన్ గిల్ ను టీమ్ నుంచి తప్పించారు. నిజానికి ఫుల్ షాట్ ఆడటంతో దిట్ట అయిన రోహిత్.. అదే ఫుల్ షాట్ ఆడుతూ ఔట్ కావడం అతని ఫామ్ లేమిని సూచిస్తోందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ మండి పడ్డాడు. ఇక ఈ టెస్టులో కెప్టెన్సీ వైఫల్యాలపై కూడా అసహనం వ్యక్తం చేశాడు.






దేశవాళీల్లోనూ అంతంతే..
ప్రస్తుత రోహిత్ ఆటతీరు చూస్తేంటే దేశవాళీల్లోనూ సత్తా చాటే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఆడింది ఒక్క ఇన్నింగ్సే అయినా, తడబాటు, ఫుట్ వర్క్ లేమీ తదితర కారణాలో ఈ నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం 37వ పడిలో ఉన్న రోహిత్ టెస్టు కెరీర్ పై కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు.. ఆసీస్ సిరీస్ లో అతను ఔటైన విధానం చూసి ఫైరయ్యాడు. ఫుట్ వర్క్ లేమి, అలసట, రెండు రకాల మైండ్ సెట్ తో బంతిని ఆడి, సునాయసంగా ఔటయ్యాడని విమర్శించారు. ఏజ్ రిత్యా రోహిత్ అంత చురుకుగా లేడని, బంతిపై షాట్ ఆడటంతో లేట్ అయ్యాడని, అందుకే క్యాచింగ్ ప్రాక్టీస్ మాదిరిగా రోహిత్ క్యాచ్ ఇచ్చి ఔటవుతాడని ఫైరయ్యారు. ఏదైనా గతే ఏడాది టీ20 ప్రపంచకప్ సాధించి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. చూడబోతుంటే టెస్టులకు కూడా గుడ్ బై చెప్పే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు యువ ప్లేయర్లకు చాన్స్ దక్కుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


Also Read: Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ