Mumbai Indians vs Chennai Super Kings: ఐపీఎల్ 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తక్కువ స్కోరుకు పరిమితం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (32: 21 బంతుల్లో, ఐదు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెన్నై విజయానికి 120 బంతుల్లో 158 పరుగులు కావాలి.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (32: 21 బంతుల్లో, ఐదు ఫోర్లు), రోహిత్ శర్మ (21: 13 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి బంతి నుంచే వేగంగా ఆడారు. దీంతో ముంబై పవర్ ప్లే ఆరు ఓవర్లలోనే 61 పరుగులు సాధించింది. అయితే వేగంగా ఆడే క్రమంలో పవర్‌ప్లేలోనే రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు.
అక్కడ నుంచి ముంబై ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. కామెరాన్ గ్రీన్ (12: 11 బంతుల్లో, ఒక ఫోర్), తిలక్ వర్మ (22: 18 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), టిమ్ డేవిడ్ (31: 22 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), హృతిక్ షౌకీన్ (18 నాటౌట్: 13 బంతుల్లో, మూడు ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేరుకోగలిగారు. చెన్నై స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితం అయింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. మిషెల్ శాంట్నర్, తుషార్ దేశ్‌పాండేలకు రెండేసి వికెట్లు దక్కాయి. సిసంద మగల ఒక వికెట్ తీసుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), శివమ్ దూబే, డ్వైన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, సిసంద మగల, తుషార్ దేశ్‌పాండే
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
రాజవర్ధన్ హంగర్గేకర్, అంబటి రాయుడు, షేక్ రషీద్, ఆకాష్ సింగ్, సుభ్రాంశు సేనాపతి
ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
రమణదీప్ సింగ్, సందీప్ వారియర్, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ, నేహాల్ వధేరా