Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ఐపీఎల్ 2023 సీజన్ 19వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌కు దిగనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
అబ్దుల్ సమద్, వివ్రాంత్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ డాగర్, వాషింగ్టన్ సుందర్
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఎన్ జగదీసన్, నితీష్ రానా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వెంకటేష్ అయ్యర్, డేవిడ్ వైస్, కుల్వంత్ ఖేజ్రోలియా
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయం కోసం ఎదురు చూస్తోంది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతోంది. ఇందుకు వేదిక ఈడెన్ గార్డెన్స్! లీగులో ఈ రెండు జట్లదీ ఆసక్తికర రైవల్రీ! మరి వీరిలో ఎవరిపై ఎవరిది ఆధిపత్యం? పిచ్ రిపోర్టు ఏంటంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగులో అత్యంత బలమైన జట్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒకటి. రెండుసార్లు ట్రోఫీ గెలిచిందంటే మాటలు కాదు! సొంతగడ్డపై దానికి తిరుగులేదు. ఎంతటి బలమైన ప్రత్యర్థినైనా కకావికలం చేయగలరు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చివరి సారి తలపడ్డ ఐదు మ్యాచుల్లో 3 సార్లు కేకేఆర్ గెలిచింది. సన్‌రైజర్స్ ఒక్కసారే గెలవగా ఒక మ్యాచ్ టై అయింది. 2021లో రెండుసార్లే కేకేఆర్‌నే విజయం వరించింది. 2022లో కేకేఆర్, సన్‌రైజర్స్ ఒక్కోసారి గెలిచాయి.
హిస్టారికల్‌గా చూసినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌దే పైచేయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 23 సార్లు తలపడ్డాయి. 14 మ్యాచుల్లో కేకేఆర్ విజయ ఢంకా మోగించింది. 8 సార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను విజయం వరించింది. ఒక మ్యాచ్ టై అయింది. ఆరెంజ్ ఆర్మీపై కేకేఆర్ విజయాల శాతం 63.04గా ఉంది. ఇక మునుపటి దక్కన్ ఛార్జర్స్ పైనా వారిదే అప్పర్ హ్యాండ్. 9 సార్లు తలపడగా 7 సార్లు కోల్‌కతా, 2 సార్లు డీసీ గెలిచాయి.
ఈడెన్ గార్డెన్ పిచ్ చాలా బాగుంటుంది. చాలా మంది క్రికెటర్లకు ఇది అచ్చొచ్చిన మైదానం. బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సాయపడుతుంది. ఇక్కడ ఛేదన సులభంగా ఉంటుంది. రాత్రి పూట డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ. బంతి గ్రిప్ అవ్వడం కష్టం. అందుకే టాస్ గెలవగానే నేరుగా బౌలింగ్ ఎంచుకుంటారు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 79 మ్యాచులు ఆడగా ఛేజింగ్ టీమ్ 47 సార్లు గెలిచింది. టాస్ గెలిచిన జట్టు 55 శాతం గెలిచింది.
ఇప్పుడు పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఇందులో జట్టు నెట్ రన్‌రేట్ -1.502గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇవి రెండూ ఇప్పటి వరకు పాయింట్ల ఖాతా తెరవలేకపోయాయి. ముంబై నెట్ రన్‌రేట్ ప్రస్తుతం -1.394 కాగా, ఢిల్లీ రన్‌రేట్ -2.092గా ఉంది.