Pat Cummins IPL value halved At auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ వేలం నేడు బెంగళూరు వేదికగా జరుగుతోంది. కీలక ఆటగాళ్లు తొలి రౌండ్ వేలంలో అమ్ముడుపోగా కొందరు ఆటగాళ్లకు రికార్డు ధర పలకగా.. మరికొందరికి నిరాశే ఎందురైంది. సన్‌రైజర్స్ తరఫున గత కొన్ని సీజన్లు ఆడిన మనీశ్ పాండే, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడిన పాట్ కమిన్స్‌కు ఐపీఎల్ 2022 మెగా వేలంలో నిరాశే ఎదురైంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మనీశ్ పాండేకు ఈ సీజన్లో నిరాశ తప్పలేదు. గత ఏడాది తీసుకున్న మొత్తంలో ఈ వేలంలో సగం కూడా ధర పలకలేదు. గత సీజన్ కోసం సన్ రైజర్స్ అతడికి రూ.11 కోట్లు వెచ్చించగా తాజా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ మనీశ్ పాండే తీసుకుంది. అయితే కేవలం రూ.4.6 కోట్లకు అతడ్ని దక్కించుకుంది. గత సీజన్‌తో పోల్చితే కనీసం సగం ధర కూడా మనీశ్‌కు రాలేదు.
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్, ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్‌కు భారీ ధర దక్కినా నిరాశ తప్పలేదు. రూ.7.25 కోట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్ కమిన్స్‌ను దక్కించుకుంది. ఐపీఎల్ 2021లో రూ.15.5 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్ ఈ ఏడాది సరిగ్గా సగం ధరకు కమిన్స్‌ను తీసుకుంది.
గత సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన డేవిడ్ వార్నర్ తప్పని పరిస్థిత్తులో ఫ్రాంచైజీని వీడాడు. కానీ అతడు ఊహించినట్లుగా తాజా వేలంలో ధర మాత్రం దక్కించుకోలేకపోయాడు. గత ఐపీఎల్ లో సన్‌రైజర్స్ నుంచి రూ.12 కోట్లు తీసుకున్న వార్నర్‌ను తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ సగం ధరకే కొనుగోలు చేసింది. రూ.6.25 కోట్లకు ఢిల్లీ ఫ్రాంచైజీ వార్నర్‌ను తక్కువ ధరకే దక్కించుకుంది.
పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు డేవిడ్ మిల్లర్, టీమిండియా మాజీ క్రికెటర్ సురేస్ రైనాను తొలి రౌండ్లో ఏ కొనుగోలు చేసేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు సైతం తొలి రౌండ్లో మొండిచేయి చూపాయి ఫ్రాంచైజీలు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు సైతం ఫ్రాంచైజీలు షాకిచ్చాయి. కెప్టెన్‌గా, ఆటగాడిగా రాణించిన స్మిత్‌ను తీసుకునేందకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. మరుసటి రౌండ్లలో వీరిని ఏదో ఓ ఫ్రాంచైజీ బెస్ ప్రైస్ కు సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది.
Also Read: IPL Auction 2022 Live: ఐపీఎల్ 2022 వేలంలో భారీ ధర పలికిన ఆటగాళ్లు వీరే