IPL 2022 Top 5 Most Expensive Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) క్రికెట్ ప్రేమికులకు మరింత వినోదాన్ని పంచనుంది. ఈ ఏడాది మరో రెండు జట్లు వచ్చి చేరడంతో మొత్తం 10 జట్లతో సీజన్ జరుగుతుంది. ఇదివరకే ఫ్రాంచైజీలు 33 మంది ఆటగాళ్లను రీటెయిన్ చేసుకోగా మిగతా 590 మంది క్రికెటర్స్ వేలంలో ఉన్నారు. అత్యల్పంగా ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.47.5 కోట్లు, అత్యధికంగా పంజాబ్ కింగ్స్ రూ.72 కోట్లతో వేలంలో పాల్గొన్నాయి.


ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంట పండింది. ఢిల్లీ రిలీజ్ చేసిన అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. రూ.12.25 కోట్ల భారీ ధరకు అయ్యార్‌ను కేకేఆర్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. రిలీజ్ చేసిన ఆటగాడు అయ్యర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ సైతం వేలంలో ట్రై చేయడం విశేషం.






పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి అవకాశం ఇచ్చింది. అతడిపై నమ్మకంతో ఏకంగా రూ.10.75 కోట్లతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో దక్కించుకుంది.






దక్షిణాఫ్రికా కీలక పేసర్ కగిసో రబాడకు డిమాండ్ పెరిగింది. ఏకంగా రూ.9.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ సఫారీ పేసర్‌ను తీసుకుంది. 






వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్‌కు పోటీ పెరిగింది. చెన్నై, ముంబై, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ జరగగా.. చివరికి లక్నో ఫ్రాంచైజీ రూ.8.75 కోట్లకు తీసుకుంది.






విండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ షిమ్రోన్ హిట్మేయర్ కు భారీ ధర దక్కింది. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.8.5 కోట్లతో కొనుగోలు చేయండి.






సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్​ మాజీ ప్లేయర్​ శిఖర్​ ధావన్​ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరగా పంజాబ్ కింగ్స్ జట్టు ధావన్‌ను రూ. 8.25 కోట్లకు సొంతం చేసుకుంది.






ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ కోసం భారీగా వేలం జరిగింది. ముంబైని ఛాంపియన్ గా నిలపడంతో కీలక పాత్ర పోషించిన న్యూజిలాండ్ ఆటగాడు బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. రూ.8కోట్లకు రాజస్థాన్ తీసుకుంది.






ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్, ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్‌కు భారీ ధర దక్కినా నిరాశ తప్పలేదు. రూ.7.25 కోట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్ కమిన్స్‌ను దక్కించుకుంది. ఐపీఎల్‌ 2021లో రూ.15.5 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్ ఈ ఏడాది సరిగ్గా సగం ధరకు కమిన్స్‌ను తీసుకుంది.