IPL Aution 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. రేపు (డిసెంబర్ 23) కోచిలో ఈ ఆక్షన్ జరగనుంది. ఆయా ఫ్రాంచైజీల్లో 87 స్లాట్ ల కోసం వేలం నిర్వహించనున్నారు. ఇప్పటికే జట్లన్నీ కలిసి మొత్తం 163 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీ యాజమాన్యాలు కోచి చేరుకున్నట్లు సమాచారం.
ఈరోజు ఫ్రాంచైజీల మీటింగ్
ఐపీఎల్ మినీ వేలం కొచిలోని బోల్గట్టి ద్వీపంలోని గ్రాండ్ హయత్ హోటల్ లో జరగనుంది. ఈ వేలం కోసం బీసీసీఐ ఆ హోటల్ లోని 2 అంతస్థులను బుక్ చేసింది. మినీ ఆక్షన్ 7 గంటలపాటు జరగనుంది. మధ్యంలో ఒక గంట విరామం ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ సీఈవో జేక్ లషమ్ క్రమ్, ఆర్సీబీ విశ్లేషకుడు ఫ్రెడ్డీ వైల్డ్ ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. ఈరోజు 10 జట్ల ఫ్రాంచైజీ మీటింగ్ జరగనుంది.
అలాగే ఇవాళ ఫ్రాంచైజీ యజమానులు ఐపీఎల్ పాలక మండలి సభ్యులతో సమావేశం కానున్నారు.
ఐపీఎల్ 2023 మినీ ఆక్షన్ రూపం
10 జట్లు ఇప్పటికే 163 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి
87 స్లాట్‌లకు వేలం నిర్వహిస్తారు.
విదేశీ క్రికెటర్ల కోసం 30 స్లాట్లు మిగిలి ఉన్నాయి
అన్ని ఫ్రాంచైజీల వద్ద కలిపి మొత్తం రూ. 206.50 కోట్ల మనీ పర్స్ ఉంది.
ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే రూ. 743.5 కోట్లు ఖర్చు చేశాయి.
వేలం ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ?
ఐపీఎల్ 2023 వేలాన్ని తొలిసారిగా ఇద్దరు బ్రాడ్ కాస్టర్లు ప్రసారం చేయనున్నారు. జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అలాగే స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఐపీఎల్ ను టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు వేలం ప్రారంభమవుతుంది.
ఆయా జట్ల వద్ద మిగిలిఉన్న పర్స్ వాల్యూ
ముంబై ఇండియన్స్: రూ 20.55 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రూ 20.45 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: రూ 19.45 కోట్లు
రాజస్థాన్ రాయల్స్: రూ 13.2 కోట్లు
లక్నో సూపర్ జెయింట్: రూ 23.35 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ 8.75 కోట్లు
గుజరాత్ టైటాన్స్: రూ. 19.25 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: రూ. 7.05 కోట్లు
పంజాబ్ కింగ్స్: రూ 32.2 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ. 42.25 కోట్లు.