K L Rahul and Mohammed Siraj IPL Auction 2025: ఐపీఎల్(IPL) వేలంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్(K L Rahul) భారీ ధర పలికాడు. వేలం ఆరంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కత్తా నైట్ రైడర్స్ రాహుల్ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. రాహుల్ ఆర్సీబీకి ఆడతాడన్న అంచనాలు ఆరంభం నుంచి ఉన్నాయి. దానికి తగ్గట్లే బెంగళూరు,... రాహుల్ కోసం పోరాడింది.
బెంగళూరు, కోల్‌కత్తా ఎంతకీ తగ్గకపోవడంతో రాహుల్ ధర అమాంతం పెరుగుతూ పోయింది. పది కోట్ల వరకూ ఆర్సీబీ, కోల్‌కత్తా మధ్యే రాహుల్ కోసం పోటీ జరిగింది. అయితే మధ్యలో ఢిల్లీ రావడంతో రాహుల్ ధర మరింత పెరిగింది. మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా రావడంతో రాహుల్ కోసం పోటీ మరింత తీవ్రమైంది. చెన్నై, ఢిల్లీ మధ్య రాహుల్ కోసం తీవ్ర పోటీ జరిగింది. అయినా ఢిల్లీ వెనక్కి తగ్గలేదు. చివరికి ఢిల్లీ రూ. 14 కోట్లకు రాహుల్‌ను ఢిల్లీ దక్కించుకుంది. వేలంలో అయ్యర్, పంత్ లతో పోల్చితే రాహుల్ కు చాలా తక్కువ ధర వచ్చింది. సీజన్లలో మినిమం 500 రన్స్ చేసే రాహుల్ కు భారీ రేటు రాలేదని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
సిరాజ్ మియాకు రూ. 12.75 కోట్లు
హైదరాబాదీ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj ) భారీ ధర పలికాడు. అంచనాలను అందుకుంటూ రూ. 12 కోట్లకు పైనే అమ్ముడు పోయాడు. స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా రూ. 12 కోట్లపైనే ధర పలికాడు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు, లక్నో సూపర్ జెయింట్స్ సిరాజ్ కోసం పోటీ పడ్డాయి. సిరాజ్ మియా కోసం గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీ పడింది. చివరికి సిరాజ్‌కు రూ. 12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
బట్లర్, స్టార్క్‌లకు భారీ ధర
రాజస్థాన్ రీటెయిన్ చేయకపోవడంతో ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర పలికాడు. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన బట్లర్‌ను రూ.15.75 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. అలాగే ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను రూ.11.75 కోట్లకు గుజరాత్ టైటాన్సే సొంతం చేసుకుంది.
RCBలోకి లివింగ్ స్టోన్
పంజాబ్ కింగ్స్ వదిలేసిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. స్టోన్ రూ.2కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. ఆల్ రౌండర్ కావడంతో అతడి కోసం పలు జట్లు పోటీ పడ్డాయి. చివరికి రూ.8.75 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది.