Shreyas Iyer Sold To Punjab Kings Most Expensive Player in IPL History: 

ఐపీఎల్ (IPL) వేలంలో శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)... గత రికార్డులను బద్దలు కొట్టాడు. ఏకంగా 26.75 కోట్లకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన  ఆటగాడిగా అయ్యర్  రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యారు అదరగొట్టాడు. బేస్ ప్రైస్ రూ.2కోట్లు ఉండగా.. రూ.26.75కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా శ్రేయాస్ నిలిచాడు. కాగా, గత ఏడాది శ్రేయాస్ KKR తరఫున ఆడాడు.





 

 

భారీ ధర పలికిన అర్ష్ దీప్

సౌదీలోని జెడ్డాలో ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభమైంది. ఈ వేలంలో టీమిండియా యంగ్ ప్లేయర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ భారీ ధరకు అమ్ముడయ్యాడు. రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ అతడిని దక్కించుకుంది. మొదట్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ అతడి కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆ తర్వాత SRH, PBKS రంగంలోకి దిగాయి. చివరకు RTMను ప్రయోగించిన పంజాబ్ రూ.18 కోట్లకు దక్కించుకుంది. కాగా, ఈ వేలంలో అమ్ముడైన తొలి ప్లేయర్ ఇతడే.

 





 

రూ.10 కోట్లకు అమ్ముడైన రబాడ

ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతోంది. ఈ వేలంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్‌ కగిసో రబాడాను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. రూ.10.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ రబాడాను దక్కించుకుంది. కాగా, అంతకముందు అర్ష్‌దీప్‌ సింగ్‌‌ను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు దక్కించుకుంది.

 





 

వేలంలో ఎవరెవరున్నారంటే:

ఐపీఎల్‌2025 కోసం జరుగుతున్న ఈ 18వ వేలంలో పది ఫ్రాంఛైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీపడుతున్నాయి. వీరిలో  48 మంది క్యాప్డ్ ప్లేయర్లు , 272 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. గత IPL సీజన్లలో ఆడిన అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లు 152 మంది కాగా అన్‌క్యాప్డ్ ఇంటర్నేషనల్స్ ముగ్గురు మాత్రమే. అలాగే అన్‌క్యాప్డ్ ఇండియన్స్ 965 మంది ఆటగాళ్లు కాగా 104 మంది అన్‌క్యాప్డ్ అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. ఈ సారి వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు 46 మంది ఆటగాళ్లను రీటెయిన్ చేసుకున్నాయి. రాజస్థాన్, కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్లు మొత్తం 6 స్లాట్లకు ఆటగాళ్లను రీటెయిన్ చేసుకున్నాయి. అంటే మొత్తానికి  204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలుంది.