IPL Auction 2023:  ఐపీఎల్ 2023 మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. రేపు (డిసెంబర్ 23) కోచిలో ఈ ఆక్షన్ జరగనుంది. ఆయా ఫ్రాంచైజీల్లో 87 స్లాట్ ల కోసం వేలం నిర్వహించనున్నారు. ఇప్పటికే జట్లన్నీ కలిసి మొత్తం 163 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీ యాజమాన్యాలు కోచి చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బీసీసీఐ ఈ వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ మినీ ఆక్షన్ లో 405 మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. అయితే ఈ లిస్టులో ఉన్న అతిపెద్ద, అతి చిన్న వయసున్న ఆటగాళ్లు ఉన్నారు. వారెవరో తెలుసుకుందామా...


అతి పిన్న వయస్కుడు అఫ్ఘన్ బౌలర్


అఫ్ఘనిస్థాన్ బౌలర్ అల్లా ఘజన్ ఫర్ ఐపీఎల్ 2023 మినీ వేలం కోసం తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ ఐపీఎల్ ఆక్షన్ లో పాల్గొనబోయే అతి పిన్న వయస్కుడు ఇతనే. ఘజన్ ఫర్ జులై 15, 2007న జన్మించాడు. అంటే అతని వయస్సు 15 సంవత్సరాల 151 రోజులు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన ఘజన్ ఫర్ మిస్ ఐనాక్ నైట్స్ తరఫున షప్ గీజా క్రికెట్ లీగ్ లో ఆడుతున్నాడు. 


అతిపెద్ద వయస్కుడు భారత ఆటగాడే


అలాగే భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఈ ఐపీఎల్ వేలంలో పాల్గొనబోతున్న అతిపెద్ద వయస్కుడు. ప్రస్తుతం మిశ్రా వయసు 40 సంవత్సరాలు 19 రోజులు. 2019 సీజన్ కు ముందు ఇతనిని ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసింది. స్పిన్ బౌలింగ్ వేసే మిశ్రా ఈ ఆక్షన్ కోసం తన పేరును నమోదు చేసుకున్నాడు. 


వేలం ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ?


ఐపీఎల్ 2023 వేలాన్ని తొలిసారిగా ఇద్దరు బ్రాడ్ కాస్టర్లు ప్రసారం చేయనున్నారు. జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అలాగే స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఐపీఎల్ ను టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు వేలం ప్రారంభమవుతుంది.


ఆయా జట్ల వద్ద మిగిలిఉన్న పర్స్ వాల్యూ


ముంబై ఇండియన్స్: రూ 20.55 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రూ 20.45 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: రూ 19.45 కోట్లు
రాజస్థాన్ రాయల్స్: రూ 13.2 కోట్లు
లక్నో సూపర్ జెయింట్: రూ 23.35 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ 8.75 కోట్లు
గుజరాత్ టైటాన్స్: రూ. 19.25 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: రూ. 7.05 కోట్లు
పంజాబ్ కింగ్స్: రూ 32.2 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ. 42.25 కోట్లు.