IPL 2023 Auction Live Streaming Free:
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువ మంది వీక్షించే లీగుల్లో ఐపీఎల్ ఒకటి! ఆటగాళ్ల వేలంతో సరికొత్త సీజన్ సందడి మొదలవుతుంది. ఈ సారి డిసెంబర్ 23న కోచి వేదికగా మినీ వేలం జరుగుతోంది. ఏ ఫ్రాంచైజీలు ఎవరిని కొనుగోలు చేస్తాయి? ఏ క్రికెట్‌ర్ ఎక్కువ పలుకుతాడు? ఎవరి కోసం ఎక్కువ పోటీ ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్, బ్రాడ్ కాస్టింగ్, టైమింగ్, ఇతర వివరాలు మీకోసం!
వేర్వేరు బ్రాడ్‌కాస్టర్లు
ఈ సారి ఐపీఎల్ ప్రసార హక్కులను రెండు కంపెనీలు దక్కించుకున్నాయి. టీవీ, బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ ఇండియా తీసుకుంది. డిజిటల్ లైవ్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను వయాకామ్18-రిలయన్స్ కైవసం చేసుకుంది. జియో యూజర్లు, జియో సినిమా యూజర్లు ఉచితంగానే ఐపీఎల్ మిని వేలాన్ని చూడొచ్చు. గతానికి భిన్నంగా 4K క్వాలిటీతో ప్రసారం ఉంటుందని సమాచారం. ఇక టీవీలో స్టార్‌స్పోర్ట్స్‌లో వస్తుంది.
ఐపీఎల్ 2023 వేలం లైవ్ స్ట్రీమింగ్‌ను ఉచితంగా చూడటం ఎలా?
జియో వినియోగదారులు ఐపీఎల్ 2023 లైవ్ స్ట్రీమింగ్‌ను ఉచితంగా చూడొచ్చు.
ఐపీఎల్ 2023 వేలాన్ని ఏ ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి?
ఐపీఎల్ 2023 వేలాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టెలికాస్ట్ చేస్తోంది. ప్యాకేజీ ఉన్నవాళ్లు ఆక్షన్‌ను ఆస్వాదించొచ్చు.
ఐపీఎల్ 2023 వేలం లైవ్‌స్ట్రీమింగ్ ఎందులో వస్తుంది?
ఐపీఎల్ 2023 వేలం లైవ్ స్ట్రీమింగ్ జియో సినిమాలో ప్రసారం అవుతుంది. జియో టీవీ యాప్స్‌లోనూ వేలాన్ని చూడొచ్చు.
ఐపీఎల్ 2023 వేలం వివరాలు?
డిసెంబర్ 23న వేలం జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఆరంభం అవుతుంది. వేదిక కోచి.
ఐపీఎల్ 2023 వేలంలో పాల్గొనే ఆటగాళ్ల వివరాలు?
మొత్తం 405 మంది ఆటగాళ్లు వేలంలో పేరు నమోదు చేసుకున్నారు. ఇందులో 273 మంది భారతీయులు. 132 మంది విదేశీయులు. అందులో నలుగురు అసోసియేట్ దేశాల నుంచి ఉన్నారు. జాతీయ జట్లకు ఆడిన వారు 119, ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయని వారు 282, అసోసియేట్ దేశాల నుంచి 4 ఉన్నారు. గరిష్ఠంగా 87 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అంఉదలో 30 విదేశీయులకు కేటాయించారు.
కనీస ధర రూ.2 కోట్ల విభాగంలో ఎవరున్నారు?
టామ్ బాంటన్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, తైమల్ మిల్స్, జేమీ ఓవర్టన్, క్రెయిన్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, కేన్ విలియమ్సన్, ఆడమ్ మిల్న్, జిమ్మీ నీషమ్, రిలే రొసొ, రసి వాన్‌డర్ డుసెన్, జేసన్ హోల్డర్, నికోలస్ పూరన్