IPL 2025 Live Streaming Details |  క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 18వ ఎడిషన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. నేడు (మార్చి 22న) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. గత ఐపీఎల్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ కావడంతో IPL మొదటి మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా మారింది.   ముందు గ్రాండ్ ఓపెనింగ్ వేడుక జరుగుతుంది. గత ఐపీఎల్ సీజన్లలా కాకుండా, ఈ ఏడాది IPL 13 వేదికలలో ప్రారంభ వేడుకలు నిర్వహిస్తున్నారు. 


ఐపీఎల్ సీజన్ 18 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతాను ఆర్సీబీ ఢీకొట్టనుంది. KKR vs RCB IPL 2025 సీజన్ తొలి మ్యాచ్‌కు ముందు కోల్‌కతాలో ఓపెనింగ్ వేడుకలు గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. మొత్తం 10 జట్లు ఉండగా.. 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 12 డబుల్ హెడర్ మ్యాచ్‌లున్నాయి. కాగా, 2008లో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో తలపడ్డ ఆర్సీబీ, కేకేఆర్ జట్లు సీజన్ తొలి మ్యాచ్‌లో తలపడటం ఇదే తొలిసారి.


మ్యూజిక్, ఎంటర్ టైన్మెంట్‌తో కార్యక్రమాలతో ఐపీఎల్ 2025 శనివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ ఓపెనింగ్ వేడుక అభిమానులను ఆకర్షిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. IPL 2025 గ్రాండ్ ఓపెనింగ్ వేడుక ఎప్పుడు, ఎక్కడ, టైమింగ్స్ లాంటి వివరాల కోసం క్రికెట్ ప్రేమికులు చెక్ చేస్తుంటారు. వారి కోసం పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 


IPL ప్రారంభ వేడుక ఎప్పుడు జరుగుతుంది?
IPL 18 ప్రారంభోత్సవం మార్చి 22న జరగనుంది. KKR vs RCB మ్యాచ్ ప్రారంభానికి ముందు, సాయంత్రం 6:00 గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ వేడుక మొదలవుతుంది. 


IPL 2025 ప్రారంభోత్సవం ఎక్కడ జరుగుతుంది?
IPL ప్రారంభ వేడుక కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనుంది.


IPL 2025 ఓపెనింగ్ వేడుక ఎక్కడ వీక్షించాలి?
భారత్‌లో IPL 2025 ప్రారంభ వేడుక స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇంకా JioHotstar యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ వీక్షించవచ్చు.



IPL 2025 ఓపెనింగ్ ఈవెంట్.. 
శ్రేయా ఘోషల్, కరణ్ ఆజ్లా, దిశా పటాని తమ మ్యూజిక్ తో పాటు డ్యాన్స్ ప్రదర్శనలతో IPL 2025 ప్రారంభోత్సవాన్ని మరింత కలర్ ఫుల్ చేయనున్నారు. 


IPL 2025 ప్రదర్శన ఇచ్చే వారి జాబితా
దిశా పటాని
శ్రేయా ఘోషల్
కరణ్ ఆజ్లా ప్రదర్శన ఇవ్వనున్నారు.
అరిజిత్ సింగ్, వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ లను సంప్రదించినట్లు సమాచారం. కానీ వారు ఓకే చేశారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.