playoff qualification scenarios and chances of all teams: ఐపీఎల్ 2024(IPL 2024)లో అన్ని టీమ్స్ హోరాహోరీగా తలపడుతున్నాయి. నేడు సన్‌రైజర్స్(SRH) వర్సెస్ లక్నో(LSG) మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా మారింది. ప్లే ఆఫ్స్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్ కోసం దాదాపు అన్ని జట్లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. సీజన్ ముగింపు దశకు వచ్చినా.. ఏ జట్టు కూడా ఇంకా అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. పాయింట్ల పట్టికను చూస్తే.. కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు చేరినట్లే. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లకు చాలా సంక్లిష్టమైన అవకాశాలు ఉన్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హోరాహోరీ సాగుతోంది. అయితే ఇక్కడి నుంచి ప్రతీ మ్యాచ్ కీలకమైన వేళ జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు చూద్దాం...
కోల్‌కతా నైట్ రైడర్స్( Kolkata Knight Riders):
కోల్‌కత్తా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కోల్‌కత్తా ఇంకో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్క విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటారు.
రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals):
రాజస్థాన్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ కూడా ఇంకో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్క విజయం సాధిస్తే రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings):
చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే చెన్నై ఎలాంటి గణాంకాలతో పని లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక మ్యాచ్ ఓడిపోయినా వేరే జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిఉంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)
ఢిల్లీ మిగిలిన రెండు మ్యాచుల్లోనూ విజయాలు సాధించాలి. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే ఢిల్లీకి 16 పాయింట్లు వస్తాయి. అప్పుడు కూడా ఇతర జట్ల గణాంకాలు, నెట్ రన్‌రేట్‌పై ఆధారపడి ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad):
హైదరాబాద్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో SRH నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో మూడు విజయాలు సాధిస్తే హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు చేరుతుంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించినా ప్లేఆఫ్‌లకు చేరుకోవచ్చు. కానీ నెట్ రన్‌రేట్ కీలకంగా మారుతుంది.
లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants):
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్ ఐదో స్థానంలో ఉంది. లక్నో కూడా మిగిలిన మూడు మ్యాచ్‌లలో మూడు గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుతుంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించినా ప్లేఆఫ్‌లకు చేరుకోవచ్చు. కానీ నెట్ రన్‌రేట్ కీలకంగా మారుతుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. అందులో మూడు గెలిస్తే 14 పాయింట్లు వస్తాయి. అయినా ప్లే ఆఫ్ చేరడం కష్టం.
ముంబై ఇండియన్స్(Mumbai Indians):
ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నా ఆ రెండింట్లో విజయం సాధించినా ముంబై ప్లే ఆఫ్ చేరడం కష్టమే. పంజాబ్(Punjab Kings), గుజరాత్(Gujarat Titans) కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి.