MS Dhoni like a diesel engine that never stops, says AB de Villiers:  మహేంద్రసింగ్‌ ధోనీ(Mahendra Singh Dhoni) కూల్‌ కెప్టెన్‌.. టీమిండియా(Team India)కు అత్యధిక ఐసీసీ ట్రోఫీ(ICC Trophies)లు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అంతేనా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL )లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీతో మ్యాజిక్‌ చేసి గెలవదు అనుకున్న ఎన్నో మ్యాచ్‌లను మలుపు తిప్పి గెలిచేలా చేయడంలో ధోనీ ప్రావీణ్యం అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల వయసులోనూ గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టి తాను ఎందుకు అంత విజయవంతమైన కెప్టెన్‌నో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి చాటి చెప్పాడు. IPLలో ఎంఎస్ ధోనీ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గానూ ధోనీ ఇప్పటికే రికార్డు సృష్టించాడు. ధోనీని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ మరోసారి ఆకాశానికి ఎత్తేశాడు.



ధోనీ  ఆటకు ముగింపు లేదు
ధోనీ గురించి ప్రతిసారీ పుకార్లు వస్తుంటాయని.. గతేడాది కూడా ధోనీకి అదే చివరి ఐపీఎల్‌ అని ఎన్నో పుకార్లు చేశారని ఏపీ డివిలియర్స్‌ గుర్తు చేశాడు. కానీ ధోనీ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో దూసుకొచ్చాడని గుర్తు చేశాడు. ధోనీ డీజిల్‌ ఇంజిన్‌ లాంటోడని.. అతడికి ఎప్పటికీ ముగింపు ఉండదని డివిలియర్స్‌ అన్నాడు. ధోనీ మాత్రమే తన వీడ్కోలుపై నిర్ణయం తీసుకోగలడని అన్నాడు. ధోనీ నాయకత్వం, ఫ్లెమింగ్‌ కోచింగ్‌లో ఆడడం యువ ఆటగాళ్లకు ఒక వరమని ఏబీడీ  అన్నాడు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నైసూపర్ కింగ్స్‌ అని ఏబీ డివిలియర్స్‌ వ్యాఖ్యానించాడు.


ధోనీ పోస్ట్‌లో ఏముందంటే? 
ఇండియన్స్‌  ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభోత్సవానికి సమయం సమీపిస్తున్న వేళ చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఈ పోస్ట్‌తో ధోనీ రిటైర్‌మెంట్ అంశం మ‌రోసారి చ‌ర్చకు వ‌చ్చింది. కొత్త సీజన్-కొత్త పాత్ర కోసం వేచి ఉండలేను. చూస్తూ ఉండండని ధోని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌తో ధోనీ మరోసారి ఆటకు వీడ్కోలు పలకునున్నాడన్న వార్త హల్‌చల్‌ చేస్తోంది. ధోని కోచ్‌గా ఉంటాడ‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ధోనీ కోచింగ్ చేస్తార‌ని ఒకరు... కొత్త పాత్ర అంటే ఏమిటి అని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.


ఇంకో రెండేళ్లు!
ధోనీ తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌కు కూడా సిద్ధమైపోయాడని ఊహాగానాల వేళ మహీ చిన్ననాటి స్నేహితుడు పరమ్‌జిత్‌ సింగ్‌ కీలక విషయాన్ని వెల్లడించాడు. ధోనీ ఫిట్‌నెస్‌ చూస్తే ఇదే చివరి సీజన్‌ అని అనుకోలేమని... ప్రస్తుత సీజన్‌తోపాటు కనీసం మరో రెండేళ్లు ఆడతాడని అనుకుంటున్నానని... దానికి కారణం అతడి ఫిట్‌నెస్‌ స్థాయే కారణమని అన్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 17వ సీజన్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వేళ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన ధోనీ ఐపీఎల్‌ తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపాడు. తొలి సీజన్‌ నాటి సంగతులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. 2008లో ఆడిన చెన్నై జట్టు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉందన్న ఈ కెప్టెన్ కూల్‌... చాలామంది ఆల్‌రౌండర్లు అందులో ఉన్నారని అన్నాడు.