IPL 2024 Qualifier 1 News Updates: అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఐపీఎల్ 2024 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో కోల్‌కత్తా నైట్ రైడర్స్, సన్ రైడర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ వేదికలో లీగ్ దశలో జరగాల్సిన గత రెండు మ్యాచ్ లు వర్షార్పణం అయ్యాయి. దాంతో ఈ మ్యాచ్ ఏమవుతుందోనని హైదరాబాద్ ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. కానీ మంగళవారం నాడు అహ్మదాబాద్ వాతావరణం వేడి, ఉక్కపోతతో ఉంది. వర్షం కురిసే అవకాశమే లేదని తెలియడంతో హైదరాబాద్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


ఒకవేళ వర్షం పడి మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోతే, డక్ వర్త్ లూయిస్ ప్రకారం జరగాల్సిన ఓవర్ల మ్యాచ్ నిర్వహించే ఛాన్స్ లేకపోతే లీగ్ స్టేజీలో పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ అయిన కేకేఆర్ నేరుగా ఫైనల్ చేరుతుంది. అయితే వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉండటంతో మ్యాచ్ నెగ్గి సన్ రైజర్స్ తొలి ఫైనలిస్ట్ కావాలని SRH ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 


ఖరీదైన ఆటగాళ్ల పోరు.. విజేత ఎవరో
ఐపీఎల్ 2024లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్. కోల్‌కత్తా వేలంలో రూ. 24.75 కోట్లకు మిచెల్ స్టార్క్ ను కొనుగోలు చేయగా, సన్‌రైజర్స్ కెప్టెన్ పాటి కమిన్స్ కోసం మేనేజ్‌మెంట్ రూ. 20.5 కోట్లు కుమ్మరించింది. ఈ ఖరీదైన ఆటగాళ్ల పోరులో జట్టును గెలిపించే మ్యాచ్ విన్నరు ఎవరు అవుతారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అహ్మదాబాద్‌ లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ సార్లు నెగ్గాయి. గత 6 మ్యాచుల్లో సెకండ్ బ్యాటింగ్‌ చేసిన టీమ్స్ 4 మ్యాచ్‌లు గెలిచాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు రెండుసార్లు మాత్రమే నెగ్గగా, కమిన్స్ టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకోవడం మైనస్ అవుతోంది. పైగా బౌలర్లు ఈ పిచ్‌పై మెరుగ్గా రాణిస్తారని గణాంకాలు ఉన్నాయి. 


 






సన్ రైజర్స్ టీమ్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్,  విజయకాంత్ వియాస్కాంత్, నటరాజన్
సన్ రైజర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: సన్వీర్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనద్కత్, వాషింగ్టన్ సుందర్.


కోల్‌కతా టీమ్: సునీల్ నరైన్, రహ్మానుల్లా గుర్బాజ్ (కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, చక్రవర్తి, హర్షిత్ వర్ణ.
కేకేఆర్ ఇంపాక్ట్ ప్లేయర్స్: మనీష్ పాండే, నితీష్ రాణా, అనుకుల్ రాయ్,కేఎస్ భరత్, షెర్ఫానే రూథర్‌ఫర్డ్