Russell Reaction: విశాఖపట్నం: వైజాగ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) మ్యాచ్‌లో  పరుగుల వరద పారింది. సిక్సర్లతో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (KKR)  బ్యాట‌ర్లు    సునీల్ న‌రైన్, రఘువంశీలు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆపై ఆండ్రీ రస్సెల్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్ ముందు వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇటీవల చేసిన 277 పరుగుల రికార్డ్ బద్ధలు కొడతారనిపించింది. కానీ కోల్‌కతా  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ తరువాత ఇది ఓ జట్టు చేసిన రెండో అత్యధిక స్కోరు.



 
(Photo Credit: Twitter/IPL)


ఇషాంత్ యార్కర్‌కు రస్సెల్ క్లీన్ బౌల్డ్
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఇషాంత్ శర్మ కేకేఆర్ హిట్టర్ రస్సెల్ కు చెక్ పెట్టాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతిని అద్భుతమైన యార్కర్ గా సంధించగా రస్సెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రస్సెల్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 41 రన్స్ చేశాడు. టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఈ వికెట్ ను అంతగా సెలబ్రేట్ చేసుకోకుండా నార్మల్ గా కనిపించాడు. కానీ ఇషాంత్ యార్కర్ బాల్ అంచనా వేయలేని రస్సెల్ క్రీజులో అలాగే పడిపోయాడు. ఆపై లేచి మోకాళ్లపై కూర్చుని నాలుక్కరుచుకున్నాడు. ఔటయ్యాక క్రీజు వదిలి వెళుతూ మంచి బాల్ వేశావంటూ బ్యాట్‌ను మరో చేతితో కొడుతూ బౌలర్ ఇషాంత్ ను అభినందించాడు రస్సెల్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






35 ఏళ్ల వయసులో ఇషాంత్ శర్మ అద్భుతమైన బౌలింగ్ చేశాడని నెటిజన్లు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. వాస్తవానికి ఓ దశలో సన్ రైజర్స్ చేసిన లీగ్ హయ్యస్ట్ స్కోర్ 277 బ్రేక్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ రస్సెల్ ఔట్ కావడంతో హైదరాబాద్ రికార్డ్ సేఫ్ అయింది. రస్సెల్ ఔటయ్యే సమయానికి 19.1 ఓవర్లలో కేకేఆర్ స్కోర్ 6/264.  మరో 5 బంతుల్లో 14 స్కోర్ చేస్తే లీగ్ చరిత్రలో కేకేఆర్ అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచేది. కానీ అదే ఓవర్లో 3వ బంతికి ఇషాంత్ .. రమణ్ దీప్ సింగ్ ను ఔట్ చేశాడు. చివరికి కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.