Indian Premier League 2023: ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఈ క్రమంలో చెన్నై జట్టు తరఫున ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే పేరిట చెత్త రికార్డు నమోదైంది. గుజరాత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తుషార్ తన నాలుగు ఓవర్లలో 56 పరుగులు సమర్పించుకున్నాడు.


ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తుషార్ దేశ్‌పాండే నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ప్రసీద్ కృష్ణ పేరు మీద ఉండేది. 2022 సీజన్‌లో ప్రసీద్ కృష్ణ తన బౌలింగ్‌లో మొత్తం 551 పరుగులు సమర్పించుకున్నాడు. 2020 సీజన్‌లో 548 పరుగులు చేసిన కగిసో రబడ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.


ఈ సీజన్ రికార్డు చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని పేస్ బౌలర్ తుషార్ దేశ్ పాండే 16 మ్యాచ్ ల్లో 28.86 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. అయితే దీంతో పాటు 564 పరుగులు కూడా సమర్పించుకున్న తుషార్ దేశ్ పాండే కచ్చితంగా తన జట్టుకు చాలా ఖరీదైన బౌలర్ అని నిరూపించాడు.


ఐపీఎల్‌ ఫైనల్‌ చరిత్రలో గుజరాత్‌ అత్యధిక స్కోరు
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోరు నమోదు చేసింది. అంతకుముందు ఐపీఎల్ ఫైనల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉంది. 2016 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 207 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహా 54 పరుగులు చేయగా, 21 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ సాయి సుదర్శన్ గుజరాత్ తరఫున 96 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.


ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌కు మంచి భాగస్వామ్యాలు లభించాయి. మొదటి మూడు వికెట్లకు 50కు పైగా భాగస్వామ్యాలను గుజరాత్ బ్యాటర్లు ఏర్పరిచారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (39: 20 బంతుల్లో, ఏడు ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (54: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి బంతి నుంచే వేగంగా ఆడారు. వీరి ఆటతో గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. అయితే ఏడో ఓవర్లో గిల్‌ను అవుట్ చేసి జడేజా మొదటి వికెట్ తీసుకున్నాడు.


ఆ తర్వాత వృద్ధిమాన్ సాహాకు వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (96: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు)  జత కలిశాడు. వీరు రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే వృద్ధిమాన్ సాహా అవుటయ్యాడు. క్రీజులో కుదురుకున్న సాయి సుదర్శన్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (21: 12 బంతుల్లో, రెండు సిక్సర్లు) అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. వీరు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. సెంచరీకి నాలుగు పరుగుల ముంగిట మతీష పతిరనా బౌలింగ్‌లో సాయి సుదర్శన్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది.