MI vs RCB, IPL 2023: 


ఐపీఎల్‌ 2023 అత్యంత కీలక దశకు చేరుకుంది! గెలిస్తే తప్ప ప్లేఆఫ్ ఆశలు నిలబడని పరిస్థితి వచ్చేసింది. మంగళవారం చెరో పది పాయింట్లున్న ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (MI vs RCB) ఢీకొంటున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరిది పైచేయి? రీసెంట్‌ ఫామ్‌ ఏంటి? పిచ్‌ రిపోర్టు ఎలా ఉంది?


ముంబయిదే అప్పర్‌ హ్యాండ్‌!


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో కొన్ని పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయి. కొన్ని జట్లు తలపడితే అభిమానులు పొంగి పోతారు! అలాంటివే ముంబయి, బెంగళూరు. ఒక జట్టులో విరాట్‌ కోహ్లీ, మరో దాంటో రోహిత్‌ శర్మ ఉండటమే ఇందుకు కారణం! ఇద్దరికీ మంచి ఫాలోయింగ్‌ ఉండటంతో మ్యాచులపై క్రేజ్‌ పెరుగుతుంది. ఐపీఎల్‌లో ఆర్సీబీ, ఎంఐ ఇప్పటి వరకు 31 సార్లు తలపడ్డాయి. ఇందులో 17-13తో హిట్‌మ్యాన్‌ సేనదే పైచేయి!


ఆర్సీబీదే రీసెంట్ ఫామ్‌!


ఒకప్పుడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును అల్లాడించిన ముంబయి ఇండియన్స్‌ ఇప్పుడు కాస్త డల్‌ అయింది. రీసెంట్‌ ఫామ్‌ అంత బాగాలేదు. చివరి 5 మ్యాచుల్లో నాలుగు సార్లు ఓటమి చవిచూసింది. 2020 అక్టోబర్‌ 28న ఆఖరి విజయం అందుకుంది. అప్పట్నుంచి కోహ్లీసేన చేతిలో ఎంఐకి ఓటములే ఎదురవుతున్నాయి. 2021లో ఒక మ్యాచులో 2 వికెట్లు, మరో మ్యాచులో 51 రన్స్ తేడాతో ఓడిపోయింది. 2022లో ఒకే మ్యాచ్‌ ఆడితే.. అందులో 9 బంతులు మిగిలుండగానే 7 వికెట్లతో పరాజయం చవిచూసింది. ఈ సీజన్‌ తొలి మ్యాచులోనూ 22 బంతులు మిగిలుండగా 8 వికెట్లతో ఓడింది.


పిచ్‌ రిపోర్ట్‌


వాంఖడే అంటేనే రన్‌ ఫెస్ట్‌! పిచ్‌ చాలా సింపుల్‌గా ఈజీ పేస్‌తో ఉంటుంది. మంచు రావడంతో ఛేదన సులభం అవుతుంది. ఈ సీజన్లో నాలుగు మ్యాచుల్లో మూడు ఛేదన జట్లే గెలిచాయి. మ్యాచ్‌ సమయంలో వాతావరణం ప్రశాంతంగానే ఉండనుంది. వాంఖడేలో ఇప్పటి వరకు 106 మ్యాచులు జరిగాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు 49, ఛేదన జట్లు 57 గెలిచాయి. టాస్ గెలిస్తే దాదాపుగా మ్యాచ్‌ చేతిలో ఉన్నట్టే! ఎందుకంటే టాస్ గెలిచిన జట్ల విన్నింగ్‌ పర్సంటేజీ 52 శాతంగా ఉంది.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహి పాల్ లోమ్రార్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోను యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్వెస్, హిమాన్షు శర్మ,  రీస్ టాప్లీ.


ముంబై ఇండియన్స్ జట్టు: కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.