MI vs RCB Preview: 


ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 2023లో నేడు 54వ మ్యాచ్‌ జరుగుతోంది. వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (MI vs RCB) తలపడుతున్నాయి. రెండు జట్లూ పది పాయింట్లతో ఉండటంతో గెలిచిన వాళ్లు టాప్‌-3కి వెళ్తారు. మరి ఎవరి పరిస్థితి ఎలా ఉంది?


వాంఖడే.. ముంబయికి అడ్వాంటేజీ!


ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians).. గతేడాదితో పోలిస్తే ఈసారి కాస్త మెరుగ్గానే ఆడుతోంది. సరైన టైమ్‌లో ఫామ్‌లోకి వచ్చి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచులో హిట్‌మ్యాన్‌ సేనకు గెలుపు అవకాశాలు ఎక్కువ! ఇక్కడ ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో మూడుసార్లు టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) చివరి 4 ఇన్నింగ్సుల్లో మూడుసార్లు డకౌట్‌ అయ్యాడు. దాన్నుంచి బయటపడాలి. చెపాక్‌లో విఫలమైనప్పటికీ వాంఖడేలో ముంబయి మిడిలార్డర్‌కు తిరుగులేదు. కామెరాన్‌ గ్రీన్‌, టిమ్‌ డేవిడ్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ హిట్టింగ్‌ చేస్తున్నారు. ఇషాన్‌ సైతం ఫామ్‌లో ఉన్నాడు. వధేరా ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్‌ పరంగా ఇబ్బందులు దాటాలి. ఆర్చర్‌కు తోడుగా నిఖార్సైన ఇండియన్‌ పేసర్‌ లేకపోవడం పెద్ద మైనస్‌! పియూష్‌ చావ్లా, హృతిక్‌ షోకీన్‌, కుమార్‌ కార్తికేయ రూపంలో మంచి స్పిన్నర్లు ఉన్నారు.


టాప్‌-3 అప్రోచ్‌తో ఫెయిల్‌!


విరాట్‌ కోహ్లీ (Virat Kohli) నాయకత్వంలో రెండు మ్యాచుల్లో వరుస విజయాలు అందుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) డీలాపడింది! టాప్‌ ఆర్డర్‌ అప్రోచ్‌ వారిని దెబ్బకొడుతూనే ఉంది. విరాట్‌ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్‌, మాక్స్‌వెల్‌ ఔటయ్యారంటే.. ఇంకెవ్వరూ బిగ్‌ ఇన్నింగ్స్‌ ఆడటం లేదు. దాంతో ఈ త్రయం రక్షణాత్మకంగా ఆడాల్సి వస్తోంది. మహిపాల్‌ లోమ్రర్‌ ఫామ్‌లోకి రావడం గుడ్‌ సైన్‌! గతేడాది ఫినిషర్‌గా ఆకట్టుకున్న దినేశ్‌ కార్తీక్‌ నుంచి అస్సలు మెరుపులే లేవు! బెంగళూరు బౌలింగ్‌ మాత్రం బాగుంది. మహ్మద్‌ సిరాజ్‌ ఓపెనింగ్‌ స్పెల్స్‌ ఆడేందుకు వీలవ్వడం లేదు. సరైన లెంగ్తుల్లో వేస్తున్నాడు. అతడికి తోడుగా హేజిల్‌వుడ్‌ అదరగొడుతున్నాడు. మధ్యలో హర్షల్‌ పటేల్‌ ఉన్నాడు. స్పిన్‌ బౌలింగ్‌ పరంగా కాస్త డల్‌గా ఉంది. హసరంగ ఉన్నప్పటికీ అతడినీ టార్గెట్‌ చేస్తున్నారు. షాబాజ్‌ క్లిక్‌ అవ్వడం లేదు. వాంఖడేలో విరాట్‌, డుప్లెసిస్‌, మాక్సీ భారీ షాట్లు ఆడగలరు.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహి పాల్ లోమ్రార్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోను యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్వెస్, హిమాన్షు శర్మ,  రీస్ టాప్లీ.


ముంబై ఇండియన్స్ జట్టు: కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.