CSK vs PBKS, IPL 2023:


ఐపీఎల్‌ 2023లో ఆదివారం డబుల్‌ హెడర్‌ జరుగుతోంది. తొలి మ్యాచులో చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్ గెలిచిన ఎంఎస్ ధోనీ వెంటనే బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఎండ కొడుతున్నప్పుడు తొలుత బ్యాటింగ్‌ చేయడం వల్ల పేసర్లకు విశ్రాంతి దొరుకుతుందని అన్నాడు. జట్టులో మార్పులేమీ చేయలేదని వెల్లడించాడు.


'మేం తొలుత బ్యాటింగ్ చేస్తాం. వికెట్‌ బాగుంది. పగటి పూట ఆడుతున్నప్పుడు ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది. ఫాస్ట్‌ బౌలర్లకు కొంత విశ్రాంతి దొరకుతుంది. మధ్యాహ్నం మ్యాచులో కొందరు ఆటగాళ్లు త్వరగా రావాల్సి ఉంటుంది. అందుకే తెలివిగా ప్రవర్తించాలి. ఎండలో ఎక్కువగా ఉండొద్దు. ఐపీఎల్‌ సుదీర్ఘ టోర్నమెంట్‌. అన్ని మ్యాచులూ మనకు అనుకూలంగా ఉండవు. నేర్చుకుంటూనే ఉండాలి. సేమ్‌ టీమ్‌తో ఆడుతున్నాం' అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ అన్నాడు.


'మేమూ మొదట బ్యాటింగే చేయాలనుకున్నాం. పగటి పూట ఆడుతున్నాం. వికెట్‌ డ్రైగా ఉంది. మంచు కురవదు. మేం మళ్లీ కొత్తగా మొదలు పెడుతున్నాం. గత మ్యాచుల నుంచి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. మెరుగవ్వాలి. పోరాట పటిమ కనబర్చాలి. చివరి మ్యాచులో భిన్నంగా ప్రయత్నించాను. కానీ పనవ్వలేదు. మేం సానుకూల దృక్పథంతో ముందుకెళ్తాం. హార్‌ప్రీత్‌ తిరిగొస్తున్నాడు' అని పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్ ధావన్‌ అన్నాడు.


చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్


పంజాబ్‌ కింగ్స్‌ తుది జట్టు: అథర్వ తైదె, శిఖర్‌ ధావన్‌, లియామ్ లివింగ్‌స్టన్‌, సికిందర్‌ రజా, సామ్‌ కరన్‌, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్‌ బ్రార్‌, కాగిసో రబాడా, రాహుల్‌ చాహర్‌, అర్షదీప్‌ సింగ్‌


చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ప్లేఆఫ్‌కు వెళ్లాలనే ఆశను నిలుపుకోవాలనేది శిఖర్ ధావన్ జట్టు ఉద్దేశం. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు సాగనుంది. చెన్నై, పంజాబ్ జట్టులో టాలెంటెడ్ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వీరి మధ్య మ్యాచ్ సమయంలో ఆసక్తికరమైన పోటీ కనిపిస్తుంది.


అర్ష్‌దీప్ సింగ్ Vs రుతురాజ్ గైక్వాడ్: చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా అర్ష్‌దీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. ఐపీఎల్‌లో పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 13 బంతుల్లో రుతురాజ్‌ను రెండుసార్లు ఔట్ చేశాడు.


కగిసో రబడ వర్సెస్ రుతురాజ్ గైక్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్ కగిసో రబడపై చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రికార్డు అంత బాలేదు. రబడ నాలుగు మ్యాచ్‌ల్లో అతన్ని రెండుసార్లు అవుట్ చేశాడు.



పంజాబ్ కింగ్స్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్‌లో ఫాస్ట్ బౌలర్లపై 194 పరుగులు చేశాడు. కానీ స్పిన్నర్లపై వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. అతను స్పిన్ బౌలర్లపై 25.8 సగటుతో 123 పరుగులు చేశాడు.


చెన్నై సూపర్ కింగ్స్ ఎక్స్‌పెన్సివ్ ఫాస్ట్ బౌలర్లు: ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్లు పవర్‌ప్లే సమయంలో ఎక్స్‌పెన్సివ్‌గా మారారు. పవర్‌ప్లేలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు ఓవర్‌కు 10.1 పరుగులు వెచ్చించారు.