CSK in IPL:
ఇండియన్ ప్రీమియర్ లీగులో చెన్నై సూపర్ కింగ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. లీగు చరిత్రలోనే అత్యధిక సార్లు 200+ స్కోర్లు చేసిన జట్టుగా అవతరించింది. ఇప్పటి వరకు 24 సార్లు 200కు పైగా స్కోర్లు చేసి రికార్డుల దుమ్ము దులిపింది. ఇవన్నీ ఎంఎస్ ధోనీ సారథ్యంలోనే నమోదవ్వడం ప్రత్యేకం. ఇందులో ఎక్కువ పరుగుల వాటా 'చిన్న తలా' సురేశ్ రైనాకే దక్కుతుంది.
ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57; 31 బంతుల్లో 3x4, 4x6), డేవాన్ కాన్వే (47; 29 బంతుల్లో 5x4, 2x6), శివమ్ దూబె (26; 13 బంతుల్లో 2x4, 2x6) దంచికొట్టారు. దాంతో సీఎస్‌కే ఏకంగా 217 పరుగులు చేసింది. ఇలా 200 ప్లస్ స్కోర్ చేయడం ఆ జట్టుకు ఇది 24వ సారి.
చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 10 స్కోర్లు
ఐపీఎల్‌లో ధోనీ సేన 5 సార్లు 220 ప్లస్ స్కోర్లు సాధించింది. 2021లో కోల్‌కతాపై 220/3; 2012లో దిల్లీపై 222/5; 2013లో హైదరాబాద్‌పై 223/3; 2008లో పంజాబ్‌పై 240/5; 2010లో రాజస్థాన్‌పై 246/5 స్కోర్లు చేసింది. వీటిలో దిల్లీ, హైదరాబాద్ మ్యాచ్ మినహాయిస్తే మిగిలిన మ్యాచుల్లో స్వల్ప తేడాతోనే గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు 210 నుంచి 220 వరకు స్కోర్లు చేసింది. ఇందులో రెండు సార్లు లక్నోపై, దిల్లీ, ముంబయి, బెంగళూరుపై ఒక్కోసారి సాధించింది. మిగిలినవన్నీ 200 నుంచి 210 స్కోర్లు.
చెన్నై సూపర్ కింగ్స్ మురిసింది! చెపాక్‌లో సొంత అభిమానులను మైమరిపించింది. లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 218 లక్ష్య ఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ను 205/7కు పరిమితం చేసింది. మొయిన్ అలీ (4/26) ప్రత్యర్థి దూకుడును దెబ్బతీశాడు. కైల్ మేయర్స్ (53; 22 బంతుల్లో 8x4, 2x6) వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదాడు. నికోలస్ పూరన్ (32; 18 బంతుల్లో 2x4, 3x6) మెరిశాడు. అంతకు ముందు సీఎస్‌కేలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57; 31 బంతుల్లో 3x4, 4x6), డేవాన్ కాన్వే (47; 29 బంతుల్లో 5x4, 2x6), శివమ్ దూబె (26; 13 బంతుల్లో 2x4, 2x6) దంచికొట్టారు.
బిగ్ టార్గెట్స్‌ను ఛేజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఓపెనింగ్ అవసరమో కైల్ మేయర్స్, కేఎల్ రాహుల్ అలాగే ఆడారు. పవర్‌ప్లే ముగిసే సరికే వికెట్ నష్టానికి 80 పరుగులు చేశారు. విండీస్ విధ్వంసక ఆటగాడు మేయర్స్ 21 బంతుల్లోనే వరుసగా రెండో హాఫ్ సెంచరీ కొట్టాడు. అతడి షాట్లకు సీఎస్‌కే భయపడిపోయింది. స్టాండ్స్‌లో అభిమానులు సైలెంట్‌గా కూర్చిండిపోయారు. అయితే 5.3వ బంతికి మొయిన్ అలీ అతడిని ఔట్ చేసి బ్రేకిచ్చాడు. జట్టు స్కోరు 82 వద్ద దీపక్ హుడా (2)ను శాంట్నర్, రాహుల్ (20)ను మొయిన్ ఔట్ చేసి ఒత్తిడి పెంచారు. వికెట్లు పడుతున్నా 9.1 ఓవర్లకే లక్నో 100 చేసింది. 14 ఓవర్లకు 136/5తో నిలిచింది. నికోలస్ పూరన్ భీకరమైన షాట్లు ఆడి రన్‌రేట్‌ను అదుపులో ఉంచాడు. జట్టు స్కోర్ 156 వద్ద 15.6వ బంతికి అతడిని దేశ్‌పాండే ఔట్ చేసి కాన్ఫిడెన్స్ పెంచుకున్నాడు. ఆఖరి ఓవర్లో విజయ సమీకరణం 28గా మారింది. అయితే ఆయుష్ బదోనీ (23), కృష్ణప్ప గౌతమ్ (17*), మార్క్‌వుడ్ (10*) కలిసి 15 పరుగులే చేయడంతో లక్నో 205/7తో ఆగిపోయింది.