ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలింగ్ దళం పంజాబ్‌ను కట్టడి చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌రైజర్స్ విజయానికి 120 బంతుల్లో పరుగులు కావాలి.


మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు వారు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ విఫలం అయ్యారు. దీంతో పంజాబ్ పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. ఆ తర్వాతి ఓవర్లోనే జానీ బెయిర్‌స్టో కూడా అవుటయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు.


ఈ దశలో ఫాంలో ఉన్న లియాం లివింగ్‌స్టోన్, షారుక్ ఖాన్ పంజాబ్‌ను ఆదుకున్నారు. షారుక్ ఖాన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డా... మరో ఎండ్‌లో లియాం లివింగ్‌స్టోన్ బౌండరీలతో చెలరేగాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ టచ్‌లో ఉండటం, షారుక్ కూడా బౌండరీలు కొడుతూ ఉండటంతో పంజాబ్ భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపించింది.


అయితే చివరి నాలుగు ఓవర్లలో సన్‌రైజర్స్ బౌలర్లు చివరి నాలుగు ఓవర్లలో చెలరేగారు. కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీశారు. రెండు బౌండరీలు మాత్రమే వచ్చాయి. ఉమ్రాన్ మలిక్ వేసిన చివరి ఓవర్ అయితే వేరే లెవల్ అని చెప్పాలి. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా నాలుగు వికెట్లు తీశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయింది.


సన్‌‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మలిక్ నాలుగు వికెట్లు తీయగా... భువీకి మూడు వికెట్లు దక్కాయి. నటరాజన్, జగదీష సుచిత్ చెరో వికెట్ తీశారు.