IPL 2022 Records: MI దారుణమైన రికార్డ్, ఐపీఎల్ చరిత్రలో మూడో జట్టుగా ముంబై ఇండియన్స్ - తొలి 2 టీమ్స్ ఇవే

Mumbai Indians Records: ఐపీఎల్ 2022లో ఇప్పటివరకూ ఖాతా తెరవని ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో వరుసగా ఆరో మ్యాచులోనూ ఓటమి చవిచూసింది. అనుకోని చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకుంది.

Continues below advertisement

IPL 2022: Mumbai Indians unwanted record after Defeated against LSG: ఐదుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీ విజేత ముంబయి ఇండియన్స్‌కు (Mumbai Indians) ఈ సీజన్‌లో అస్సలు కలిసిరావడం లేదు. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకూ ఖాతా తెరవని ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో వరుసగా ఆరో మ్యాచులోనూ ఓటమి చవిచూసింది. ముంబైపై లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Supergiants) 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు వరుసగా ఆరో మ్యాచ్‌లో ఓడిన మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 

Continues below advertisement

ఐపీఎల్ చరిత్రలో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిన మూడో జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ (ప్రస్తుతం Delhi Capitals), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) వరుసగా 6 మ్యాచ్‌లలో ఓడిన చెత్త రికార్డును కలిగి ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ చేరిపోయింది. ఢిల్లీ జట్టు తొలిసారిగా ఐపీఎల్‌లో ఏ జట్టు కూడా కోరుకోని ఇలాంటి అపప్రథను మూటకట్టుకుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) 2013లో వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిపోగా, 2019 సీజన్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ డబుల్ హ్యాట్రిక్ ఓటమిని మూటకట్టుకుంది. తమ తొలి విజయాన్ని ఏడో మ్యాచ్ లో నమోదుచేశాయి. తాజాగా రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై జట్టు ఈ సీజన్లో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఐపీఎల్ 15 సీజన్లో విజయాల ఖాతా తెరవలేక ఇబ్బందులు పడుతోంది రోహిత్ సేన. 

గతంలో వరుసగా 5 మ్యాచ్‌లు..
రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై టీమ్ గతంలో ఓ సీజన్‌లో వరుసగా 5 మ్యాచ్‌లు ఓడిపోయింది. 2014 సీజన్లో తొలి అయిదు మ్యాచ్‌లలో ముంబై ఓటమిపాలైంది. ఆరో మ్యాచ్‌లో విజయాల ఖాతా తెరిచింది. నేడు ఏకంగా ఆ చెత్త రికార్డును సవరిస్తూ ఏ జట్టూ కోరుకోని మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది ముంబై. వేలంలో ఆటగాళ్లను సరిగ్గా తీసుకోలేకపోవడమే వారి ఓటములకు కారణమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 

తరువాత మ్యాచ్‌ చెన్నైతో.. ఖాతా తెరవడం సాధ్యమేనా?
ముంబై జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో తమ చిరకాల ప్రత్యర్థి, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో తలపడనుంది. మరోవైపు రవీంద్ర జడేజా సారథ్యంలోని సీఎస్కే సైతం ఈ సీజన్లో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. గత మంగళవారం ఆర్సీబీపై గెలుపుతో ఐపీఎల్ 2022లో తమ విజయాల ఖాతా తెరిచింది చెన్నై టీమ్.

200 టార్గెట్‌ను ఛేదించలేకపోయిన ముంబై
లక్నోలో కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ (103*; 60 బంతుల్లో 9x4, 5x6) సెంచరీ చేశాడు. మనీశ్‌ పాండే (38; 29 బంతుల్లో 6x4), క్వింటన్‌ డికాక్‌ (24; 13 బంతుల్లో 4x4, 1x6) రాణించడంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 199/4తో నిలిచింది. భారీ లక్ష్య ఛేదనలో మరోసారి తడబాటుకు లోనైన ముంబై ఇండియన్స్ 181/9 పరుగులకే పరిమితమైంది. సీజన్‌లో వరుసగా 6వ ఓటమి చవిచూసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (37; 27 బంతుల్లో 3x4), డీవాల్డ్‌ బ్రూవిస్‌ (31; 13 బంతుల్లో 6x4, 1x6), కీరన్‌ పొలార్డ్‌ (25; 14 బంతుల్లో 1x4, 2x6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు.

Also Read: MI vs LSG, Match Highlights: అయ్యయ్యో డీఫీట్‌ నంబర్‌ 6 - ముంబయిని ఓడించేసిన రాహుల్‌ సేన 

Also Read: DC Vs RCB, Match Highlights: ఢిల్లీపై పేలిన డీకే గన్ - ఆర్సీబీకి మరో విక్టరీ - ఎనిమిదో స్థానానికి పడిపోయిన పంత్ సేన!

Continues below advertisement