MS Dhoni Became the oldest player to score an IPL half century: ఇప్పుడు కూడా ఎంఎస్ ధోనీకి వయసు అయిపోయింది. అతడు తప్పుకోవాలని అంటారా. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2022 తొలి మ్యాచ్ చూస్తే ఆ మాట అనాలంటే కాస్త ఆలోచిస్తారు. కేకేఆర్‌తో జరిగిన ఇతర యువ బ్యాట్స్‌మెన్ సైతం పరుగులు చేసేందుకు చెమటోడ్చుతుంటే చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ హాఫ్ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.


ఫస్ట్ ధోనీ.. తరువాత ద్రావిడ్, సచిన్.. 
ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత పెద్ద వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడికి ధోనీ నిలిచాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్‌ల రికార్డును ధోనీ బద్దలుకొట్టేశాడు. ఇంకా చెప్పాలంటే ద్రావిడ్ పేరిట ఉన్న ఈ రికార్డు (MS Dhoni Surpasses Rahul Dravid for massive IPL batting record)ను ఇప్పుడు తన పేరిట లిఖించుకున్నాడు మిస్టర్ కూల్ ధోనీ. సచిన్ 39 ఏళ్ల 362 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేశాడు. 2013లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చేసిన ఈ అర్ధ శతకంతో అత్యధిక వయసులో ఈ ఫీట్ నమోదు చేసిన మూడో క్రికెటర్‌గా సచిన్ ఉన్నాడు.


కేకేఆర్‌పై రాణించిన ధోనీ.. 
రాహుల్ ద్రావిడ్ 40 ఏళ్ల 116 రోజుల వయసులో దక్కన్ ఛార్జర్స్‌పై 2013లో చేసిన హాఫ్ సెంచరీ అత్యధిక వయసులో ఐపీఎల్ లో ఓ ఆటగాడు చేసిన అర్ధ శతకంగా ఉండేది. నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే మాజీ కెప్టెన్ 38 బంతుల్లో అజేయ హాఫ్ సెంచరీ (50 నాటౌట్) చేశాడు. తద్వారా అత్యధిక వయసులో ఐపీఎల్ లో ఈ ఫీట్ నమోదు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు ధోనీ. ఈ సీజన్ అరంగేట్ర మ్యాచ్‌లోనే  హాఫ్ సెంచరీ చేసి 40 ఏళ్ల 262 రోజుల వయసులో ధోనీ అరుదైన ఫీట్ నమోదుచేశాడు. గతంలో 2019లో 48 బంతుల్లో 84 పరుగులు చేశాడు. తాజా హాఫ్ సెంచరీతో ఐపీఎల్ లో అతిపెద్ద వయసులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు ధోనీ.






ధోనీ హాఫ్ సెంచరీ.. కానీ సీఎస్కేకు తప్పని ఓటమి
ఐపీఎల్ 15 తొలి మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ధోనీ 38 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్, సీఎస్కే కెప్టెన్ రవీంద్ర జడేజా 28 బంతుల్లో 26 నాటౌట్ పరవాలేదనిపించడంతో ఆ స్కోర్ చేసింది సీఎస్కే. అయితే స్వల్ప లక్ష్యమైనా మరో 9 బంతులు మిగిలుండగా కేకేఆర్ విజయాన్ని అందుకుంది. రహానే 44, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 20 నాటౌట్, సామ్ బిల్లింగ్స్ 25 రన్స్‌తో రాణించారు.
Also Read: CSK Vs KKR: బోణీ కొట్టిన కోల్‌కతా - ‘జడేజా’ సేనకు మొండిచేయి - మొదటి మ్యాచ్‌లో చెన్నై ఓటమి!


Also Read: IPL 2022 Records: ఫాస్టెస్ట్ సెంచరీ హీరోలు వీరే.. యూనివర్సల్ బాస్ శతకం మాత్రం ఎప్పటికీ హైలైట్