Fastest centuries in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటేనే పరుగుల వర్షం. రికార్డుల హోరు. నేడు ఐపీఎల్ సీజన్ 15 గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ (Chennai Superkings), గతేడాది రన్నరప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knightriders) తొలి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ముంబై వేదికగా ఈ మ్యాచ్ నేటి రాత్రి జరుగుతుంది. ఐపీఎల్ 2022 ప్రారంభం కానున్న నేపథ్యంలో కొన్ని రికార్డులు ఇక్కడ తెలుసుకుందామా..


క్రిస్ గేల్
ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన శతకం (Chris Gayle  fastest hundred in IPL) బాదిన రికార్డు వెస్టిండీస్ విధ్వంసకారుడు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. కేవలం 30 బంతుల్లోనే గేల్ సునామీ శతకం సాధించాడు. 2013లో పుణే వారియర్స్‌పై 66 బంతుల్లో 17 సిక్సర్లు, 13 ఫోర్ల సాయంతో రికార్డు స్థాయిలో 175 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 20 ఓవర్లలో 263/5 చేయగా.. పుణే జట్టు 9 వికెట్లు కోల్పోయి 133 రన్స్ చేసి 130 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 


యూసఫ్ పఠాన్..
ఐపీఎల్ తొలి సీజన్ 2008లోనే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యూసఫ్ పఠాన్ మెరుపు శతకం సాధించాడు. 37 బంతుల్లోనే 100 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. దాదాపు కొన్నేళ్ల వరకు ఇదే ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీగా ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 213 పరుగులు చేయగా.. ఛేజింగ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల నష్టానికి 208 చేసింది. పఠాన్ ఔట్ కావడంతో కేవలం 4 పరుగుల తేడాతో ఆర్ఆర్2పై ముంబై విజయం సాధించింది.


డేవిడ్ మిల్లర్..
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 190 పరుగులు చేసి పంజాబ్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓ దశలో 9.5 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి పంజాబ్ 64 రన్స్ చేసింది. డేవిడ్ మిల్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మరో రెండు ఓవర్లు ఉండగానే 6 వికెట్లు తేడాతో పంజాబ్ నెగ్గింది. మిల్లర్ 38 బంతుల్లో 101 రన్స్ చేశాడు.


ఆడమ్ గిల్‌క్రిస్ట్..
ఐపీఎల్ ప్రారంభ సీజన్లో డెక్కన్ ఛార్జర్స్ ఓపెనర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ 42 బంతుల్లో మెరుపు శతకం సాధించాడు. ముంబై నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని గిల్లీ ఫాస్టెస్ట్ శతకంతో డీసీ కేవలం 12 ఓవర్లలో 10 వికెట్ల తేడాతో ఛేదించడం ఓ రికార్డ్.


ఏబీ డివిలియర్స్..
విధ్వంసకర ఆటగాళ్లలో ఒకడైన ఏబీ డివిలియర్స్ , డేవిడ్ వార్నర్ 43 బంతుల్లో సాధించిన శతకం ఐపీఎల్‌లో 5వ వేగవంతమైన  శతకంగా సంయుక్తంగా రికార్డును  కలిగి ఉన్నారు. 2016లో గుజరాత్ లయన్స్‌పై డివిలియర్స్ 12 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో  43 బంతుల్లో శతకాన్ని బాదేశాడు. 


డేవిడ్ వార్నర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 2017లో 43 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా 59 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు సాయంతో 126 పరుగులతో హోరెత్తించాడు వార్నర్. ఈ ఇన్నింగ్స్‌తో సన్ రైజర్స్ 48 రన్స్ తేడాతో కేకేఆర్‌పై గెలుపొందింది.


Also Read: Kapil Dev On MS Dhoni: ధోనీ రాకముందు క్రికెట్ ఉంది, రిటైరయ్యాక కూడా అంతే: కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు


Also Read: IPL 2022, CSK vs KKR: ముంబయి శ్రేయస్‌ అడ్డా, జడ్డూ సౌరాష్ట్ర బిడ్డ - ఫస్ట్‌ మ్యాచ్‌లో గెలుపెవరిది?