IPL 2022, KKR vs MI Preview: ఐపీఎల్ 2022 సీజన్ 14వ మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knightriders), ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తలపడుతున్నాయి. పుణె ఇందుకు వేదిక. రెండు విజయాలతో కేకేఆర్ జోష్‌తో ఉంది. రెండు పరాజయాలతో ముంబయిలో పట్టుదల పెరిగింది. మరి వీరిలో పైచేయి ఎవరిది? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? ఏ ఆటగాళ్ల కీలకం కాబోతున్నారు?
KKRపై MIదే ఆధిపత్యం
ఇండియన్ ప్రీమియర్ లీగు చరిత్రలో ముంబయి ఇండియన్స్ అత్యంత బలమైన జట్టు. ఐదు సార్లు ట్రోఫీలు గెలిచింది. రెండు సార్లు ట్రోఫీలు గెలిచిన కోల్‌కతాపై వారికి తిరుగులేని ఆధిపత్యం ఉంది. విన్నింగ్ పర్సెంటేజీ 75 శాతం ఉందటేనే అర్థం చేసుకోవచ్చు. లీగులో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 29 సార్లు తలపడితే రోహిత్ సేన ఏకంగా 22 సార్లు గెలిచింది. కేకేఆర్ 7 విజయాలకే పరిమితమైంది. చివరి సారి తలపడ్డ ఐదు మ్యాచుల్లోనూ 4-1తో ముంబయిదే ఆధిపత్యం. మరి ఈ సీజన్లో రెండు ఆడి రెండూ ఓడిన మాజీ ఛాంపియన్ బోణీ కొడుతుందేమో చూడాలి.
Ishan vs Cummins, Rohit vs Narine చూడాల్సిందే
నేటి మ్యాచులో కొందరు ఆటగాళ్ల మధ్య రైవలరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోంది. ముఖ్యంగా కమిన్స్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. ఇప్పటికే వరకు మూడు ఇన్నింగ్సుల్లో కేవలం ఐదు బంతులే ఆడి మూడుసార్లు ఔటయ్యాడు. ఇక మిస్టరీ స్పిన్నర్ సునిల్ నరైన్ బౌలింగ్ రోహిత్ శర్మ (Rohit Sharma) నిలదొక్కుంటాడేమో చూడాలి. ఎందుకంటే 18 ఇన్నింగ్స్‌ల్లో హిట్‌మ్యాన్‌ను నరైన్ 7 సార్లు ఔట్ చేశాడు. సగటు 19.6. ఇక పుణెలో పేసర్లే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. టాస్‌తో సంబంధం లేకుండా విజయాలు లభిస్తున్నాయి.
KKR vs MI Probable XI
ముంబయి ఇండియన్స్ : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ / అన్మోల్‌ప్రీత్ సింగ్, తిలక్‌వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియెల్ సామ్స్, మురుగన్ అశ్విన్, తైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్ / బాసిల్ థంపి, జస్ప్రీత్ బుమ్రా
కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేశ్ అయ్యర్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, షెల్డన్ జాక్సన్, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, టిమ్ సౌథీ, ప్యాట్ కమిన్స్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి