ఐపీఎల్‌లో మరో డబుల్ ధమాకాకు రంగం సిద్ధం అయింది. శనివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో మధ్యాహ్నం మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు టాస్ గెలిచిన జట్లు బౌలింగ్‌కే మొగ్గు చూపుతుండగా... గుజరాత్ బ్యాటింగ్ తీసుకోవడం సాహసోపేతమైన నిర్ణయమే.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో ఉండగా... కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధిస్తే... తిరిగి టాప్‌కు చేరనుంది. కోల్‌కతా గెలిస్తే టాప్-4లో చోటు సంపాదించనుంది.
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టులో ఒకే ఒక్క మార్పు చేశారు. గత మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్యా జట్టులోకి వచ్చాడు. విజయ్ శంకర్‌ను ఈ మ్యాచ్‌కు పక్కన పెట్టారు. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టులో కూడా పలు మార్పులు జరిగాయి. టిమ్ సౌతీ, శామ్ బిల్లింగ్స్, రింకూ సింగ్ జట్టులోకి వచ్చారు.
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లోకి ఫెర్గూసన్, యష్ డాయల్, మహ్మద్ షమీ
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు
వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, శామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, టిమ్ సౌతీ, శివం మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి