IPL 2022 DC won the match by 44 runs aganist KKR in match 19 brabourne stadium: దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) దిల్ ఖుష్ అయింది! ఐపీఎల్ 2022లో పోరాడి మరీ రెండో విజయం అందుకుంది. ఎట్టకేలకు విన్నింగ్ మూమెంటమ్ అందుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై 216 పరుగుల టార్గెట్‌ను కాపాడుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 171కే ఆలౌట్ చేసింది. ఛేధనలో నితీశ్ రానా (30; 20 బంతుల్లో 3x6)తో కలిసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (54; 33 బంతుల్లో 5x4, 2x6) ఫర్వాలేదనిపించారు. కుల్‌దీప్ యాదవ్ (4/35), ఖలీల్ అహ్మద్ (3/18) అంతకు ముందు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (61; 45 బంతుల్లో 6x4 2x6), పృథ్వీ షా (51; 29 బంతుల్లో 7x4 2x6) దిల్లీకి మెరుపు ఆరంభం అందించారు. ఆఖర్లో శార్దూల్ ఠాకూర్ (29*; 11 బంతుల్లో 1x4, 3x6), అక్షర్ పటేల్ (22*; 14 బంతుల్లో 2x4, 1x6) దంచికొట్టారు.
చెలరేగిన కుల్‌దీప్, ఖలీల్
ముందున్నది భారీ టార్గెట్. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కోల్‌కతా నైట్‌రైండర్స్ ఛేదన ఆసక్తికరంగా సాగింది. రెండు జట్లు 15 ఓవర్ల వరకు నువ్వా నేనా అన్నట్టుగా పోరాడాయి. ఏదేమైనా కేకేఆర్‌కు కోరుకున్న ఆరంభం దక్కలేదు. సిక్సర్లు బాదేస్తున్న వెంకటేశ్ అయ్యర్ (18)ని జట్టు స్కోరు 21 వద్ద ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. అతడే మరికాసేపటికి అజింక్య రహానె (8)ను పెవిలియన్ పంపించాడు. ఈ క్రమంలో నితీశ్ రానా (30; 20 బంతుల్లో 3x6)తో కలిసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (54; 33 బంతుల్లో 5x4, 2x6) మూడో వికెట్‌కు 42 బంతుల్లో 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 107 వద్ద రాణాను ఔట్ చేయడం ద్వారా ఈ జోడీని లలిత్ యాదవ్ విడదీశాడు. మరో 10 పరుగులకే కుల్‌దీప్ బౌలింగ్‌లో శ్రేయస్ స్టంపౌట్ అయ్యాడు. ఈ సిచ్యువేషన్‌లో అనూహ్యంగా పుంజుకున్న దిల్లీ వరుసగా సామ్ బిల్లింగ్స్ (15), కమిన్స్ (4), సునిల్ నరైన్ (4), ఉమేశ్ యాదవ్ (0)ను ఔట్ చేశారు. రన్‌రేట్ పెరగడంతో ఆండ్రీ రసెల్ (24; 21 బంతుల్లో 3x4) ఏమీ చేయలేకపోయాడు.
వార్నర్ 'షా' షో!
శ్రేయస్ అయ్యర్ టాస్ గెలవడంతో దిల్లీ క్యాపిటల్స్ (DC) మొదట బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. పిచ్, వాతావరణం ఛేజింగ్‌కు అనుకూలిస్తుందని తెలియడంతో డీసీ తెలివిగా ఆడింది. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టింది. పృథ్వీ షా (Prithvi Shaw) చివరి మ్యాచులో ఎక్కడ ఆపేశాడో అక్కడే మొదలు పెట్టాడు. మరోవైపు తొలి మ్యాచులో ఆకట్టుకోని డేవిడ్ వార్నర్ (David Warner) ట్రెండీ షాట్లతో ఉతికారేశాడు. పవర్‌ప్లే ముగిసే సరికి వీరిద్దరూ వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేశారు. దాంతో ప్రతి ఓవర్‌కు పది పరుగులు వచ్చాయి.
ఆఖర్లో శార్దూల్ సిక్సర్లు
షా 27 బంతుల్లో, వార్నర్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరూ ఇదే ఊపు కొనసాగిండచంతో తొలి వికెట్‌కు 8.4 ఓవర్లకు 93 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్ (27; 14 బంతుల్లో 2x4, 2x6) టెంపో మిస్సవ్వకుండా భారీ షాట్లు ఆడాడు. 13 ఓవర్లకే 148-2తో ఉన్న దిల్లీకి ఆ తర్వాత వరుస షాకులు తగిలాయి. కేకేఆర్ బౌలర్లు కాస్త పరుగుల్ని నియంత్రించి లలిత్ యాదవ్ (1), రోమన్ పావెల్ (8), డేవిడ్ వార్నర్‌ను ఔట్ చేశారు. అప్పటికి దిల్లీ 166-5తో నిలిచింది. ఆఖర్లో శార్దూల్ ఠాకూర్ (29*; 11 బంతుల్లో 1x4, 3x6), అక్షర్ పటేల్ (22*; 14 బంతుల్లో 2x4, 1x6) మెరుపులతో స్కోరు 215-5కు చేరుకుంది.