Hardik does not look 100 percent: Gilchrist questions MI skipper's fitness after CSK loss: ముంబై (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardic Pandya)పై మళ్లీ విమర్శల జడివాన కురుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమిని తట్టుకోలేని అభిమానులు పాండ్యాపై విమర్శలు గుప్పిస్తున్నారు. అతడి కెప్టెన్సీని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో బౌలింగ్ వేసి 43 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్‌లోనూ పాండ్యా విఫలమయ్యాడు. 6 బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. బౌలర్లను సరిగ్గా వినియోగించుకోలేదని పాండ్య కెప్టెన్సీపైనా విమర్శలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌తో పాటు అతని బ్యాటింగ్‌పై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోహిత్ శర్మ సెంచరీ సాధించినా.. ఓడిపోవడానికి హార్దిక్ కెప్టెన్సీ కారణమంటూ మాజీలు కూడా విమర్శిస్తున్నారు.
ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు
హార్దిక్ పాండ్యాపై ఫిట్‌నెస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్(Adam Gilchrist)) కీలక ప్రకటన చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పూర్తిగా ఫిట్‌గా లేడని ఆడమ్ గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. చివరి ఓవర్‌లో మహేంద్ర సింగ్ ధోని... హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వరుసగా సిక్సర్లు బాదిన తీరును చూస్తుంటే అతని ఫిట్‌నెస్ ప్రశ్నార్థకంగా మారిందని గిల్ క్రిస్ట్ అన్నారడు. పాండ్యాలో ఉన్న గొప్పదనం ఏమిటంటే అతను సవాళ్లను స్వీకరిస్తాడని... కానీ ఇప్పుడు అసలు పాండ్యా ఫిట్‌గా ఉన్నాడని మాత్రం తాను అనుకోవడం లేదని గిల్‌క్రిస్ట్ అన్నాడు . క్లిష్టమైన సమయాల్లో బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటానని పాండ్యా నిరూపించాడని.. అయితే పాండ్యా ఫిట్‌నెస్‌ను చూస్తుంటే వందశాతం లేదనిపిస్తోందని గిల్ వెల్లడించాడు. బౌలింగ్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నట్లున్నాడని.,.. బంతిపై నియంత్రణ కోల్పోతున్నాడని విశ్లేషించాడు. చాలా కాలం తర్వాత చివరి ఓవర్లలో తాను చూసిన చెత్త బౌలింగ్ హార్దిక్ పాండ్యాదే అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
పాండ్యాది సాధారణ బౌలింగ్, సాధారణ కెప్టెన్సీ అని విమర్శించాడు. పాండ్యా చెత్త నిర్ణయాల కారణంగా చెన్నై లాభపడిందని... గత మ్యాచ్‌లో అమోఘంగా రాణించిన బుమ్రా బౌలింగ్ వేసేందుకు నాలుగో ఓవర్ వరకు ఎదురు చూడాల్సి వచ్చిందని గవాస్కర్ విశ్లేషించాడు. పాండ్యా బౌలింగ్ కూడా గాడి తప్పిందని గవాస్కర్ విమర్శించాడు. హార్దిక్ తన బౌలర్లను వినియోగించుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడని గ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సెన్ అన్నాడు. హార్దిక్ ప్రేక్షకుల నుంచి విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడని... ఇవి అతడిపై చాలా ప్రభావం చూపిస్తున్నాయన్నాడు. టాస్‌కు ముందు పాండ్య నవ్వడం కూడా బాగోలేదన్న కెవిన్ పీటర్సన్... చాలా సంతోషంగా ఉన్నానని అందరికీ చూపించుకొనేందుకే పాండ్యా నటిస్తున్నాడని తెలిపాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.