IPL Latest Updates: ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ లోని వాటాను అమ్మకానికి వచ్చింది. ఆ జట్టు యాజమాన్యం సీవీసీ క్యాపిటల్ జట్టులోని 67 శాతం అంటే మూడింట రెండువంతుల వాటాను అమ్మకానికి పెట్టింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సీజన్ లోనే గుజరాత్ జట్టుకు కొత్త యాజమాన్యం వస్తుందని తెలుస్తోంది. దిగ్గజ ఫార్మా కంపెనీ టొరెంట్ ఫార్మా గుజరాత్ టైటాన్స్ ను కొనుగోలు చేసేందుకు యాజమాన్యంతో చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అయితే డీల్ ప్రైస్ ఎంత అన్నది తెలియడం లేదు. ఇప్పటికే చర్చలు ముగిసి, డీల్ కూడా తుది దశలో ఉందని, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదానికి పంపినట్లు సమాచారం. అక్కడి నుంచి అప్రూవల్ రాగానే ఈ డీల్ పూర్తవుతుందని, ఈ సీజన్ నుంచే జట్టు కార్యకలాపాలు టొరెంట్ ఫార్మా తీసుకోనుందని తెలుస్తోంది. 2021లో 5300 కోట్ల రూపాయలు వెచ్చించి, ఈ జట్టును సీవీసి క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 2025 వరకు లాకిన్ పీరియడ్ ఉండటంతో ఇప్పటివరకు అమ్మకం జరుగలేదు. లాకిన్ పీరియడ్ ముగిసిన నేపథ్యంలో ఈ డీల్ తెరమీదకి వచ్చింది.
ఎట్టకేలకు..
ఇండియాకు దేశంలో ఉన్న క్రేజ్ గురించి మాటల్లో వర్ణించలేం. అలాంటిది ఐపీఎల్ అనేది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన పేరు. క్రికెట్ ప్రపంచంలోనే కాకుండా, మిగతా క్రీడా ప్రపంచంలోనూ ఐపీఎల్ కు ఎనలేని క్రేజ్ ఉంది. ఈ లీగ్ లోకి అడుగు పెట్టాలని టొరెంట్ ఫార్మా చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 2021లో కొత్త జట్ల కోసం బిడ్లు పిలిచినప్పుడు టొరెంట్ ఫార్మా కూడా బిడ్ దాఖలు చేసింది. అహ్మదాబాద్ కు రూ.4,653 కోట్లు, లక్నో కోసం 4,356 కోట్లు కోట్ చేసింది. అయితే బిడ్ మొత్తం తక్కువగా ఉండటంతో విజయవంతం కాలేకపోయింది. ఆ తర్వాత మహిళా లీగ్ డబ్ల్యూపీఎల్ లో కూడా అడుగుపెట్టాలని ప్రయత్నించాని, అక్కడ చుక్కెదురైంది. రూ.41 కోట్ల విలువ గల ఈ గ్రూపు.. ఎంతమొత్తం వెచ్చించి, ఈ లీగ్ లో అడుగు పెడుతుందో త్వరలో ఓ క్లారిటీ వస్తుంది.
రెండుసార్లు ఫైనల్స్ కి..
లీగ్ లో గుజరాత్ కి మంచి పేరే ఉంది. 2021లో అరంగేట్రం చేసిన ఈ జట్టు.. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఏకంగా చాంపియన్ గా నిలిచింది. ఆ తర్వాత ఏడాది అతని నేతృత్వంలోనే రన్నరప్ గా నిలిచింది. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి పోయింది. అయితే గతేడాది కొత్తగా పగ్గాలు చేపట్టిన శుభమాన్ గిల్ జట్టును ముందుకు నడుపలేకపోయాడు. చెత్త ఆటతీరుతో ఎనిమిదో స్థానంలో నిలిచి, తొలి సారిగా ప్లే ఆఫ్ కు చేరడంలో విఫలమైంది. ఈసారి వేలంలో కొత్త ఆటగాళ్లతో కలకలలాడుతోంది. జోస్ బట్లర్ , రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, గిల్ తదితర ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది.
Read Also: KL Rahul News: ఆ ఇండియన్ ప్లేయర్ తో ఆటాడుకుంటున్నారు.. టీమ్ మేనేజ్మెంట్ దిగ్గజ ప్లేయర్ ఫైర్