Punjab Kings vs Chennai Super Kings: ఐపీఎల్‌ 2023 సీజన్ 41వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో ఓపెనర్ డెవాన్ కాన్వే (92 నాటౌట్: 52 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇది డెవాన్ కాన్వేకు కూడా ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు. పంజాబ్ విజయానికి 120 బంతుల్లో 201 పరుగులు కావాలి.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఎప్పటిలానే చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ మ్యాచ్‌లో కూడా మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (37: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), డెవాన్ కాన్వే (92 నాటౌట్: 52 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్) బౌండరీలతో చెలరేగారు. దీంతో ఆరు ఓవర్ల పవర్‌ ప్లే ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.ఆ తర్వాత కూడా వీరు వేగంగా ఆడారు. మొదటి వికెట్‌కు 86 పరుగులు జోడించిన అనంతరం సికందర్ రాజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రుతురాజ్ గైక్వాడ్ స్టంపౌట్ అయ్యాడు.


ఆ తర్వాత వచ్చిన శివం దూబే (28: 17 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) కాసేపు వేగంగా ఆడి అవుటయ్యాడు. మొయిన్ అలీ (10: 6 బంతుల్లో, రెండు ఫోర్లు), రవీంద్ర జడేజా (12: 10 బంతుల్లో) కూడా విఫలం అయినా మరో ఎండ్‌లో డెవాన్ కాన్వే బౌండరీలు కొట్టడం ఆపలేదు. ఒక దశలో సెంచరీ చేస్తాడు అనిపించినా చివరి ఓవర్లలో పంజాబ్ బౌలర్లు వైడ్ యార్కర్లతో ఇబ్బంది పెట్టడంతో సాధ్యం కాలేదు. చివరి రెండు బంతులను సిక్సర్లు కొట్టిన మహేంద్ర సింగ్ ధోని (13 నాటౌట్:  4 బంతుల్లో, రెండు సిక్సర్లు) చెన్నై 200 పరుగులు మైలురాయిని అందుకునేలా చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, శామ్ కరన్, రాహుల్ చాహర్, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు.


చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ


చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ఆకాష్ సింగ్, డ్వేన్ ప్రిటోరియస్, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, రాజ్‌వర్థన్ హంగర్గేకర్


పంజాబ్ కింగ్స్ తుది జట్టు
అథర్వ తైదే, శిఖర్ ధావన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, సికందర్ రజా, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్


పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ప్రభ్‌సిమ్రన్ సింగ్, మాథ్యూ షార్ట్, రిషి ధావన్, మోహిత్ రాథీ, శివం సింగ్