Chennai Super Kings vs Kolkata Knight Riders: ఐపీఎల్‌ 2023 సీజన్ 61వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) మొదట బౌలింగ్ చేయనుంది.


చెన్నై సూపర్ కింగ్స్ తన తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం ఒక్క మార్పు చేసింది. అనుకుల్ రాయల్ స్థానంలో వైభవ్ అరోరా తుది జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.


పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎనిమిదో స్థానంలోనూ, చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధిస్తే నెట్‌రన్‌రేట్ ప్రకారం మూడో స్థానం వరకు వెళ్లే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే మాత్రం అగ్రస్థానాన్ని దక్కించుకోనుంది.


చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ


చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మతీషా పతిరనా, నిశాంత్ సింధు, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, ఆకాష్ సింగ్


కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), జేసన్ రాయ్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి


కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, ఎన్ జగదీసన్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్


ఐపీఎల్ -16 లో నేడు ఈ లీగ్ లో  ఫోర్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌.. రెండుసార్లు విజేత కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది.   పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉన్న  చెన్నై సూపర్ కింగ్స్..   కోల్‌కతాను  ఓడిస్తే గుజరాత్ టైటాన్స్‌ను వెనక్కి నెట్టి   టాప్ -1 పొజిషన్‌కు చేరుకవడమే గాక  ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న తొలి జట్టుగా నిలిచే అవకాశం ఉంటుంది.


గత సీజన్ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న ధోని సేన ఈ సీజన్ లో   బ్యాటింగ్ బౌలింగ్ లలో  అద్భుతాలు చేస్తున్నది. ఓపెనర్లుగా రుతురాజ్, కాన్వేలు మంచి టచ్ లో ఉన్నారు.  వన్ డౌన్ లో వచ్చే రహానే, ఆ తర్వాత హిట్టర్ దూబేలు మిడిల్ ఓవర్స్ లో  సీఎస్కే స్కోరు వేగాన్ని పెంచుతున్నారు.   రాయుడు ఇప్పటివరకూ పెద్దగా ప్రభావం చూపకపోయినా  జడేజా, ధోనిలు ఆఖర్లో  భారీ మెరుపులతో  అలరిస్తున్నారు. 


అంతగా అనుభవం లేని బౌలింగ్ లైనప్ తో ధోని మెరుగైన ఫలితాలు రాబడుతున్నాడు. తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్‌లు పవర్ ప్లేలో కట్టడి చేస్తే మిడిల్ ఓవర్స్ లో జడేజా,  మోయిన్ అలీ, తీక్షణ లు ఆ పని చూసుకుంటున్నారు. ఇక డెత్ ఓవర్లలో   చెన్నై బౌలింగ్ బాధ్యతలను పతిరాన అత్యద్భుతంగా మోస్తున్నాడు.